సినీనటిపై కోడిగుడ్లతో దాడి..!

Edari Rama Krishna
ఈ మద్య సెలబ్రెటీలు తమ నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడటం..అది కాస్తా సోషల్ మీడియాల్ హల్ చల్ సృష్టించడం కామన్ అయ్యింది. గతంలో అమీర్ ఖాన్ అసహనం గురించి ప్రస్తావించడంతో యావత్ భారత దేశం దుమ్మెత్తి పోసింది. మొన్నటి మొన్న సల్మాన్ ఖాన్ తాను సుల్తాన్ షూటింగ్ చేసి బయటకు వచ్చినపుడు అమ్మాయిని రేప్ చేస్తే ఎలా ఇబ్బంది పడుతుందో అలా ఉందని మాట్లాడు మహిళా లోకం నుంచి ఛీత్కారాలు పొందాడు.   ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత రమ్య ఆ మద్య దాయధి పాకిస్థాన్ ను ప్రశంసిస్తూ అమె చేసిన వ్యాఖ్య పెను సంచలనాలకు దారి దీసింది. తాజాగా కాంగ్రెస్ నేత రమ్యకు చేదు అనుభవం ఎదురైంది..ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై కొంత మంతి కొడి గుడ్లు, టమాటాలు విసిరి నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  అయితే తనపై ఎందుకు దాడి చేశారో..ఎవరు చేశారో తెలియదని అంటుందిన రమ్య.  మరోవైపు దాడికి కారణం ఆమె ఈ మద్య చేసిన అనుచిత వ్యాఖ్యలే అని అంటున్నారు..పాకిస్తాన్ నరకమని కేంద్రమంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలను విభేదించి అమె.. పాకిస్థాన్ లోనూ ప్రజలు భారతీయుల్లాగానే బతుకుతున్నారని అమ వ్యాఖ్యలు చేశారు.  అయితే దాయది దేశమైన పాకిస్థాన్ తో ఇప్పటి వరకు ఎన్నో విభేదాలు కలిగి ఉన్న భారత దేశాన్ని పక్క దేశంతో పోల్చడం ఎంత వరకు సబబు అని . ఆమెపై దేశద్రోహం కేసు కూడా నమోదు అయింది.

శత్రుదేశమైన పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన రమ్యపై సెక్షన్ 124/ఎ, 334ల కింద కొడగు జిల్లా సోమవార పేటలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో ప్రైవేటుగా దేశద్రోహం కేసు దాఖలైంది.  ఇక కే విట్టలగౌడ అనే న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదును సోమవారం పరిశీలనకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మద్య రమ్య సార్క్ యువ శాసనకర్తల ప్రతినిధివర్గంలో పాల్గొని వచ్చింది. తర్వాత కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన ఒక సభలో తన యాత్రానుభవాలను వివరిస్తూ ఈ మాటలు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: