టాప్ హీరో కొంప ముంచిన పాకిస్థాన్ హీరోయిన్
ఇప్పటికే చిరంజీవి హీరోగా తెలుగు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ఈ మూవీ రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా పాకిస్థాన్ మోడల్ 'మాయా అలీ'ని చిత్ర యూనిట్ సెలక్ట్ చేసుకుంది. దీంతో ఇక్కడే ఓ చిక్కు వచ్చింది. పాకిస్థాన్ కి సంబంధించిన యాక్టర్స్ ని తీసుకోకూడదని ఓ సంస్థ అక్షయ్ కుమార్ కి ఫోన్ చేసి బెధిరించిందట.
అందుకు అక్షయ్ కుమార్ చాలా లైట్ తీసుకున్నారు. కానీ 'మాయా అలీ' ని హీరోయిన్ గా తీసుకోవటం వల్ల షూటింగ్ సమయంలోనూ, షూటింగ్ తరువాత రిలీజ్ సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని వారు చెప్పుకువచ్చారు. అందుకు అక్షయ్ కుమార్ కొంత భయపడుతున్నాడని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం.
ఇక 'మాయా అలీ' కి బాలీవుడ్ లో ఇది తొలి సినిమా ఛాన్స్. ఈ బ్యూటిని హీరోయిన్ గా తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకున్న అక్షయ్ కుమార్, ఇప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో అర్ధం కావటం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఇది బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.