హరీష్ రావు : కాంగ్రెస్ వచ్చింది... పథకాలు పోయాయి..!

Pulgam Srinivas
మెదక్ బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్ రామా రెడ్డికి మద్దతుగా, తూఫాన్ లో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్న మాజీ మంత్రి  ఎమ్మెల్యే హరీష్ రావు గారు మరోసారి కాంగ్రెస్ పార్టీపై తనదైన రీతిలో విరుచుకుపడ్డారు తాజాగా నిర్వహించిన రోడ్ షో లో భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ ... కాంగ్రెస్ వచ్చాక అంతా రివర్స్ గేర్ ఉన్నవి పోతున్నయి. కల్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయ్యాయి. కేసీఆర్ కిట్స్ బంద్ అయ్యాయి.

24 గంటల కరెంటు బంద్ అయ్యింది. తాగు నీటి కొరత వచ్చింది. పింఛన్లు ఇవ్వడం లేదు. రైతు బంధు ఇవ్వడం లేదు. తులం బంగారం జాడ లేదు. చేతగాని ప్రభుత్వం. మోసం చేసింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ నిర్మల్ సభ లో మహిళలకు నెలకు 2500వేస్తున్నమని చెప్పి అబద్ధం ఆడారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పాలి.

పార్టీలు మారిన దొంగలకు బుద్ధి చెప్పాలి. అందరి కోసం పని చేసిండు కేసీఆర్. కేసీఆర్ గారు హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తే పేగులు పీకి మెడలో వేసుకుంటా నని రేవంత్ అన్నాడు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ ను ఎలా అనడం ఎంత వరకు కరెక్ట్. అహంకారంతో ఉన్న కాంగ్రెస్ ను భూమి మీదకు తేవాలి. వాళ్ళ సంగతి అసెంబ్లీలో చెబుతా. కాంగ్రెస్ నుండి అపాయం ఉంది. తప్పించుకునే ఉపాయం మన చేతుల్లోనే ఉంది.

మైనార్టీల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేశాం. రంజాన్ తోఫా కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. బిజెపి తో మా పోరాటం నిరంతరం ఉంటుంది. దోస్తీ అయ్యుంటే ఎంపి కవిత గారిని జైలుకు ఎందుకు పంపారు. కాంగ్రెస్ బిజెపి రెండు ఒకటే. వెంకట్ రామా రెడ్డి గెలుపు హరీష్ రావు గెలుపు మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నా అని తాజా రోడ్ షోలో హరీష్ రావు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: