నాగ‌న్న స‌ర్వే నిజ‌మేనా...!

RAMAKRISHNA S.S.
- తెలంగాణ‌లో కేసీఆర్ హ్యాట్రిక్ అని బొక్క బోర్లా
- 2019లో భారీ మెజార్టీతో వైసీపీ ప్ర‌భుత్వం అని చెప్పి స‌క్సెస్‌
- 2024లో వైసీపీ ప్ర‌భుత్వంకు మొగ్గు ఉంటుంద‌ని సంకేతాలు
- ఈ సారి ఫ‌లితం తేడా వ‌స్తే నాగ‌న్న క్రెడిబులిటీ  గోవిందా..?
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
స‌ర్వే రాయుళ్ల జాబితాలో నాగ‌న్న స‌ర్వేకు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుని.. వారి అభిప్రాయాలు తెలుసుకుని.. త‌ద్వారా రిజ‌ల్ట్‌ను వెల్ల‌డించే సంస్థ‌ల‌లో నాగ‌న్న ఒక‌రు. అయితే.. ఈయ‌న కూడా.. త‌డ‌బ‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. 2023లో తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల వేళ‌.. ఎవ‌రూ కూడా.. బీఆర్ ఎస్ పార్టీ మ‌రోసారి అంటే.. మూడోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎవ‌రూ చెప్ప‌లేదు. హంగ్ వ‌స్తుంద‌ని అంద‌రూ అంచ‌నా వేసుకున్నారు.

కానీ, అనూహ్యంగా నాగ‌న్న స‌ర్వే మాత్రం మూడోసారి కూడా.. కేసీఆర్ వ‌స్తార‌ని.. హ్యాట్రిక్ కొడ‌తార‌ని.. చె ప్పారు. అంతేకాదు.. ఓట‌ర్లు.. వారి మూడ్‌ను కూడా.. క్షేత్ర‌స్థాయిలో సేక‌రించిన‌ట్టు తెలిపారు. దీనికి సం బంధించి కొన్ని లెక్క‌లు కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఆ లెక్క‌లు విక‌టించాయి. అంతేకాదు.. చాలా స‌ర్వే సంస్థ‌ల అంచ‌నాలు కూడా.. త‌ల‌కిందులు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ తొలిసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.

అంటే నాగ‌న్న స‌ర్వే..ఇక్క‌డ విఫ‌ల‌మైంది. ఇక‌, 2019లో  ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తున్న‌ట్టు నాగ‌న్న అంచ‌నా వేశారు. దీనికి కొన్ని కార‌ణాలు చెప్పారు. పాద‌యాత్ర‌.. ప్ర‌జ‌ల్లో ఉన్న సింప‌తీ వంటివి ప‌నిచేస్తు న్న‌ట్టు తెలిపారు. అయితే అప్పట్లో నాగ‌న్న చెప్పిన లెక్క 120-130 మ‌ధ్య‌లోనే వైసీపీకి సీట్లు వ‌స్తున్న‌ట్టు చెప్పారు. నిజానికి అన్ని స‌ర్వేలు కూడా.. అలానే చెప్పాయి. ఒక‌టి రెండు త‌ప్ప‌.. కానీ.. వైసీపీ 151 సీట్ల‌తో అధికారం ద‌క్కించుకుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఏపీలో మ‌రోసారి వైసీపీ ప్ర‌భుత్వ‌మే వ‌చ్చే ఛాన్సులు ఉన్న‌ట్టు చెపుతున్న వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది.

ఆయ‌న అంచ‌నా ప్ర‌కారం ఎంత ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్నా మ‌ళ్లీ జ‌గ‌న్ మ్యాజిక్ ఫిగ‌ర్ దాటి అధికారం చేప‌డ‌తాడ‌నే చెపుతున్నారు. అయితే.. నాగ‌న్న స‌ర్వేలో ఖ‌చ్చిత‌త్వం పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌డంతో ఇటీవ‌ల కాలంలో ఇమేజ్ కొంత మేర‌కు త‌గ్గింద‌నే అభిప్రాయం వుంది. సో.. దీనిని బ‌ట్టి నాగ‌న్న స‌ర్వేను న‌మ్మాలా?  వ‌ద్దా? అనేది తేల్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే ఎన్నిక‌లకు ముందు ఆయ‌న అభిప్రాయం ఎలా ?  ఉన్నా జూన్ 1న ఏం చెపుతారు.. ఏపీ రిజల్ట్ ఆయ‌న అంచ‌నాల‌తో స‌రిపోలుతుందా ? అన్న‌దానిని బ‌ట్టే ఆయ‌న క్రెడిబులిటీ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: