తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె బీ ఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి సంబంధించిన ఎన్నో పనులను నిర్వర్తించి రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం మాత్రం కవిత బీ ఆర్ ఎస్ పార్టీపై తీవ్రమైన స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. తాజాగా కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇక ఆమె బీ ఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యే పై కొన్ని కామెంట్స్ చేయగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కంప్లైంట్స్ పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దానితో కవిత కు రేవంత్ సపోర్టుగా ఉన్నాడు. ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి.
అసలు విషయం లోకి వెళితే ... తాజాగా కవిత ఐడిపీఎల్ ల్యాండ్స్ విషయంలో కూకట్పల్లి ఎమ్మెల్యే అయినటువంటి మాధవరం కృష్ణారావు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కూకట్పల్లి ఎమ్మెల్యే బీ ఆర్ ఎస్ పార్టీ ద్వారా గెలిచాడు. ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే అయినటువంటి మాధవరం కృష్ణారావు పై కవిత ఐడిపిఎల్ ల్యాండ్స్ విషయంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే కూడా అదే స్థాయిలో రెచ్చిపోవడంతో కవిత కూడా ఆయనకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇక కవిత తాజాగా కుకట్పల్లి ఎమ్మెల్యే అయినటువంటి కృష్ణారావు పై ఐడిపిఎల్ ల్యాండ్స్ విషయంలో తీవ్ర స్థాయిలో విరుచుకు పడడం ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ల్యాండ్స్ విషయంలో విచారణ జరపాలి అని సూచించినట్లు తెలుస్తోంది. దానితో ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది అని కవిత కి సపోర్టుగా రేవంత్ నిలిచాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.