"అధికారంలోకి రాగానే చేస్తా": జగన్ 'మాస్' డైలాగ్.. ప్రైవేట్ భూ వివాదంలో తప్పుడు హామీల రగడ!

Amruth kumar
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ల్యాండ్‌మార్క్ డైలాగ్ ఒకటి ఉంది: "అధికారంలోకి రాగానే న్యాయం చేస్తా... అధికారంలోకి రాగానే సాయం చేస్తా!" గత పదేళ్లలో ఆయన ఈ డైలాగ్‌ను పదేపదే వాడినప్పటికీ, అధికారంలోకి వచ్చాక చాలా మందికి ఆ హామీలు నెరవేరలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఆయన మరోసారి అదే 'మాస్' డైలాగ్‌ను ఉపయోగించడంపై రాజకీయ రగడ మొదలైంది. కోర్టు తీర్పు ఉన్నా.. 'న్యాయం' ఎలా చేస్తారు? తాజాగా, విజయవాడలోని జోజినగర్ ప్రాంతంలో జరిగిన ఒక ప్రైవేటు భూ వివాదం విషయంలో జగన్ జోక్యం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంలో ఒక వ్యక్తి స్థలం కొని ఇళ్లు కట్టుకున్న 42 మంది బాధితులు ఉన్నారు. అయితే, స్థలాన్ని అప్పటికే మరొకరికి అమ్మేయడంతో... అసలైన యజమానులు కోర్టుకు వెళ్లారు.


కోర్టు ఆదేశాలు: ఈ కేసులో అసలైన కొనుగోలుదారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇళ్లు కట్టుకున్న వారు స్థలాన్ని ఖాళీ చేసి అసలైన కొనుగోలుదారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ నెల నెలాఖరు వరకు స్టే ఇచ్చింది. జగన్ హామీ: ఇంత పెద్ద ప్రైవేటు భూ వివాదం నడుస్తుండగా... జగన్ నేరుగా బాధితుల దగ్గరకు వెళ్లారు. ఎప్పటిలాగే ఇది చంద్రబాబు కుట్ర అని ఆరోపణలు చేశారు. అనంతరం, "తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని" హామీ ఇచ్చి వెళ్లారు. హామీ వెనుక లాజిక్ లేదు! ప్రభుత్వం వచ్చాక, కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఒక ప్రైవేటు భూ వివాదంలో జగన్ ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పలేదు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తే భూమి వారికే చెందుతుంది.



 కోర్టు తీర్పు ఇచ్చినా, ఆ ఇళ్లు కట్టుకున్న వారికే ఇస్తామని జగన్ చెప్పడం అబద్ధాలు చెప్పడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన డీల్స్‌లో, కోర్టు తీర్పులు ఉన్నప్పుడు... అధికారంలో ఉండి కూడా ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడం అసాధ్యం. అయితే, సెటిల్‌మెంట్లు చేయడం అలవాటే కాబట్టి, చేస్తానని జగన్ హామీ ఇచ్చారేమో కానీ... ఇప్పటికైతే బాధితులకు పైసా సాయం చేయలేదు. కేవలం "ఓటేస్తే చేస్తా" అన్నట్టుగా కబుర్లు చెప్పి వెళ్లడం ఆయన 'పాత రాజకీయాల'కు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని జగన్... ఇప్పుడు ఓట్ల కోసం ప్రైవేటు వివాదాల్లో జోక్యం చేసుకోవడం రాజకీయ డ్రామాగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: