ఆరా మ‌స్తాన్ : తెలుగుగ‌డ్డ‌పై తిరుగులేని సెఫాల‌జిస్ట్‌.. ఏపీ ఫ‌లితాల‌పై మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్‌

RAMAKRISHNA S.S.
- 16 ఏళ్ల‌లో తెలుగుగ‌డ్డ‌పై తిరుగులేని సెఫాల‌జిస్ట్
- పార్టీ మారాల‌నుకునే టాప్ లీడ‌ర్ల‌కు మ‌స్తాన్ మాటే వేద‌వాక్కు
- తాజా ఏపీ ఎన్నిక‌ల‌పై ఏం చెపుతార‌న్న‌దే అంద‌రి ఉత్కంఠ‌
( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )
ఆరా మ‌స్తాన్‌. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి కూడా రాజ‌కీయాల్లో విశ్లేష‌ణ‌ల క‌న్నా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో విని పించే పేరు ఇది. రాష్ట్రాలు, జాతీయ స్థాయి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడిపోతార నే విష‌యాన్ని పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించ‌డంలో ఈ సంస్థ‌కు మంచి  పేరే ఉంది. ఆరా పోల్ స్ట్రాట‌జీస్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ‌కు అధినేత ఆరా మ‌స్తాన్‌. ఈయ‌న సెఫాలజిస్టుగా చిర‌ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తే కావ‌డం గ‌మ‌నార్హం. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఈయ‌న ఓవెలుగు వెలిగార‌ని చెబుతారు. ప‌ల్నాడు జిల్లాలోని చిల‌క‌లూరిపేట మండ‌లంలో మ‌ద్దిరాల ఈయ‌న స్వ‌గ్రామం. లా చ‌దివిన ఆయ‌న సెఫాల‌జిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు.

క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన నెట్ వ‌ర్క్ ఉన్న ఆరా మ‌స్తాన్‌.. గ్రౌండ్ లెవిల్లో.. ప్ర‌తి విష‌యాన్నీ అంచ‌నా వేయ డంలో ముందుంటారు. ఏ పార్టీ గెలుస్తుంద‌నే విష‌యంతోపాటు.. నాయ‌కుల గెలుపును కూడా అంచ‌నా వేయ‌డంలో ఆరాకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. అనేక మంది నాయ‌కులు కూడా ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉంటారు. ఒక పార్టీ నుంచి మ‌రోపార్టీలోకి జంప్ చేయాల‌న్నా.. త‌న గ్రాఫ్ తెలుసుకోవాల న్నా.. నాయ‌కులు ఆరా మ‌స్తాన్‌ను త‌ర‌చుగా సంప్ర‌దిస్తుంటారు.

అయితే.. గ‌త తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంత వివాదం అయ్యారు. కాంగ్రెస్ గెలుస్తుంద‌ని ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న చెప్పిన స‌ర్వేపై కొంత కాంట్ర‌వ‌ర్సీ న‌డిచింది. దీనిపై బీఆర్ఎస్‌ పార్టీ అగ్ర‌నేత‌ల‌కు ఆరా మ‌స్తాన్‌కు మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం న‌డిచింది. ఇక ఎన్నిక‌ల ముగిసిన రోజు సాయంత్ర‌మే ఆరా మ‌స్తాన్ తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో పాటు గెలిచే మంత్రులు, ఓడిపోయే మంత్రుల పేర్లు కూడా చెప్పి జెయింట్ కిల్ల‌ర్ అయ్యారు. పాల‌కుర్తిలో ఎర్ర‌బెల్లి, కామారెడ్డిలో బీజేపీ క్యాండెట్ చేతిలో కేసీఆర్ ఓడిపోతార‌ని కూడా ముందే చెప్పారు.

ఇక‌, ఇప్పుడు ఏపీ విష‌యానికి వ‌స్తే.. వైసీపీవైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌ని చెబుతున్నా.. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంద‌ని అంటున్నారు. అయితే.. ఓటు బ్యాంకు పెర‌గ‌డం వెనుక ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తోపాటు.. మొబిలైజింగ్‌, మ‌నీ మేనేజ్‌మెంట్ వంటివి ఉన్నాయ‌నేది ఆరా మాట‌. అదే టైంలో మ‌స్తాన్ పోలింగ్ శాతం పెరిగితే ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వం మారుతుంద‌ని కూడా ఓ మాట చెప్పారు.

అయితే.. పూర్తిఫ‌లితం ఎలా ఉంటుంద‌నేది ఆయ‌న జూన్ 1న ఎగ్జిట్‌పోల్స్‌లో చెప్పేయ‌నున్నారు. గ‌త కొన్నేళ్ల‌లో ఏపీ, తెలంగాణ‌లో సాధార‌ణ, అసెంబ్లీ, పార్ల‌మెంటు, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అన్నింటిలోనూ స‌క్సెస్ అయ్యారు. ఒక్క దుబ్బాక‌లో మాత్రం ఆయ‌న బీఆర్ఎస్ గెలుస్తుంద‌ని చెప్పినా బీజేపీ ర‌ఘునంద‌న్ స్వ‌ల్ప తేడాతో గెలిచారు. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే 2014, 2019లో ఆరా మ‌స్తాన్ అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. దీంతో ఇప్పుడుఏం చెబుతార‌నేది ఆస‌క్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: