జ‌గ‌న్‌దే గెలుపు... రేస్‌ స‌ర్వే అంచ‌నాల‌న్ని ఫ్యాన్ వైపే..?

RAMAKRISHNA S.S.
- వైసీపీకి ఫేవ‌ర్‌గా రేస్ అంచ‌నాలు
- కుప్పంలో చంద్ర‌బాబుకు కూడా క‌ష్ట‌కాల‌మే..?
- రేస్ స‌ర్వేల‌న్నీ జ‌గ‌న్ వైపే..?
( విజ‌య‌వాడ‌ - ఇండియా హెరాల్డ్ )
ఏపీలోనే కాదు.. ఇటీవల కాలంలో ద‌క్షిణాది రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిది? అనే అంచ‌నా వేయ‌డంలో రేస్‌(రిసెర్చ్ అసోసియేట్స్ అండ్ క‌న్స‌ల్టెంట్స్ ఆఫ్ ఎల‌క్ష‌నీరింగ్) సంస్థ కూడా ముందుంది. ఈ సంస్థ కూడా.. అనేక అంచ‌నాలు వేసింది. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే విష‌యాలు లెక్క‌గ‌ట్టింది. అయితే.. రెండు సార్లు విడుద‌ల చేసిన రిపోర్టులు కూడా..  ఒక పార్టీకి అనుకూలంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఉదాహ‌ర‌ణ‌కు.. ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందు నుంచి కూడా.. రేస్ స‌ర్వే క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. అనేక మందిని క‌లుసుకున్న‌ట్టు తెలిపింది. దీని ప్ర‌కార‌మే.. త‌మ‌కు ఫ‌లితం తెలిసింద‌ని.. దానినే అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలిపింది. ఈ క్ర‌మంలో రెండు స‌ర్వేల్లోనూ.. కూట‌మికి త‌క్కువ సీట్లు వ‌స్తాయ‌ని.. వైసీపీకి ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొంది. ఇక‌, కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కూట‌మి ఓడుతుంద‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం. కానీ.. ఎక్క‌డా కార‌ణాలు చెప్ప‌లేదు.

ఇక‌, ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు కూడా.. జ‌నం నాడినిప ట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన రేస్‌ సంస్థ‌.. అప్పుడు కూడా.. కొంత వ‌ర‌కు సీట్లు త‌గ్గినప్ప‌టికీ.. వైసీపీకే మొగ్గు చూపుతున్నార‌ని నివేదిక ఇచ్చింది. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా.. రేస్ త‌న ఫ‌లితాన్ని వెల్ల‌డించింది. అయితే.. ఈ సంస్థ విష‌యంలో ఉన్న మైన‌స్ ఏంటంటే.. ఇది లాభాపేక్ష సంస్థ‌. పేరులోనే ఉన్న‌ట్టుగా.. క‌న్స‌ల్టెంట్ సంస్థ‌. త‌మ‌ను ఎవ‌రు క‌న్స‌ల్ట్ అవుతారో.. వారికి అనుకూలంగా సేవ‌లు అందించ‌డం.. ఈ సంస్థ ప్ర‌ధానంగా చేసే ప‌ని.

దీనిని బ‌ట్టి.. రేస్ సంస్థ ఏమేర‌కు.. స‌క్సెస్ అవుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. 2014లోనే ఏపీలో జ‌గ‌న్ వ‌స్తు న్న‌ట్టు చెప్పిన ఈ సంస్థ.. అప్ప‌ట్లో విఫ‌ల‌మైంది. త‌ర్వాత‌.. మాత్రం స‌క్సెస్ అయినా.. సీట్ల విష‌యంలో కొంత మేర‌కు త‌డ‌బ‌డింది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి వైసీపీ వైపు నిల‌బ‌డింది. చిత్రం ఏంటంటే.. కుప్పం వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబుకు ఇబ్బందులు ఉన్నాయ‌ని చెప్ప‌డం ద్వారా.. ఈ సంస్థ ఏదైనా పార్టీకి కొంత మేర‌కు అనుకూలంగా ఇస్తోందనే వాద‌న‌కు ఆస్కారం ఇచ్చింది. మ‌రి న‌మ్మ‌డం.. న‌మ్మ‌క పోవ‌డం.. అనేది ప్ర‌శ్న‌గానే మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: