కార్నర్ అవుతున్న భారతీయుడు 2 !

Seetha Sailaja
కమలహాసన్ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘భారతీయుడు 2’ పై చాల అంచనాలు ఉన్నాయి. ఈసినిమా జూన్ 13న విడుదల అవుతుందని మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. త్వరలో చెన్నైలో జరగబోయే ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు రజనీకాంత్ రామ్ చరణ్ లు అతిధులుగా వస్తారని ప్రచారం జరుగుతోంది.

అయితే మీడియాలో వస్తున్న ఈ వార్తలను అంగీకరించడం కానీ లేదంటే ఖండించడం కానీ ఈమూవీ నిర్మాతలు చేయకుండా ప్రస్తుతానికి మౌన ముద్ర వహిస్తూ ఉండటంతో ‘భారతీయుడు 2’ విడుదల జూన్ లో ఉంటుందా లేదా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈమూవీలోని కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు శంకర్ మళ్ళీ రీ ఘాట్ చేస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే ఈ వార్తల పై కూడ ఈమూవీ నిర్మాతల నుండి ఎలాంటి స్పందన రావడంలేదు అని మరికొందరు అంటున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ప్రభాస్ తన ‘కల్కి’ మూవీని జూన్ నెలాఖరున విడుదల చేయడానికి ఫిక్స్ అయిన పరిస్థితులలో తన సినిమా కంటే ముందుగా ‘భారతీయుడు 2’ విడుదలై అంచనాల ప్రకారం సూపర్ హిట్ అయితే ప్రభాస్ ‘కల్కి’ మూవీకి ధియేటర్ల విషయంలో సమస్యలు ఉంటాయి కాబట్టి ‘భారతీయుడు 2’ ని జూన్ రేస్ నుండి తప్పిద్దామని కొందరు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

విక్రమ్ మూవీ తరువాత మళ్ళీ కమలహాసన్ కు క్రేజ్ ఏర్పడటంతో ‘భారతీయుడు 2’ ఖచ్చితంగా హిట్ అవుతుండనీ మరికొందరు అంచనాలు వేస్తున్నారు. అయితే రెండు భారీ సినిమాలు అయిన ‘భారతీయుడు 2’ ‘కల్కి’ ఒకే నెలలో విఉదల అయితే ఈ రెండు సినిమాలలో ఏసినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ వస్తుందో ఆసినిమాను మాత్రమే ప్రేక్షకులు చూస్తారనీ అందువల్ల కమల్ ప్రభస్ ల మధ్య పోటీ మంచిది కాదు అంటూ మరికొందరి అభిప్రాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: