నానీని కలవర పెడుతున్న రూమర్స్ !

Seetha Sailaja
భిన్నమైన  పాత్రలు ఎచుకుంటూ విభిన్నమైన సినిమాలు చేయడంలో హీరో నాని ఎప్పుడు ముందు వరసలోనే ఉంటాడు. కొత్తదనం కోసం నాని చేసే ప్రయత్నాలే ఇంత తీవ్రమైన పోటీలో కూడ నానీని నిల బెట్టాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని మరో రెండు రోజుల్లో 'జెంటిల్ మన్' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

ఈ సంధర్బంలో ఈ సినిమా పై వస్తున్న రూమర్స్ పై స్పందించాడు నాని ‘జెంటిల్ మన్’ సినిమాకు ఒక నాటి  బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘బాజీగర్’ తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘వేటగాడు’ సినిమాకి ఎటువంటి సంబంధంలేదని ఈ సినిమా ఏ సినిమాకు అనుశరణ కాదనీ అలాంటి వార్తలని పట్టించు కోవద్దనీ నానిచెపుతున్నాడు.  

వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటినుంచే ఈ అనుమానం చాలా మందికి వచ్చింది. దీనితో నాని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టాడనుకోవాలి. ‘జెంటిల్ మన్’ ట్రైలర్ లో చాలా వరకూ నాని పాత్ర బాజీగర్ లో షారూఖ్ పాత్రను పోలి ఉండటంతో ఈ అనుమానాలు ఏర్పడ్డాయి. ఒక సస్పెన్స్ లవ్ థ్రిల్లర్ గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈసినిమా పై ఎందుకో మొదటి నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

నానీకి ప్రస్తుతం ఉన్న క్రేజ్ రీత్యా ఈ సినిమాను అత్యధిక ధియేటర్లలో మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడ చాల భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ‘అ ఆ’ హడావిడి మొదలై రెండు వారాలు పూర్తి అయ్యాక సరైన గ్యాప్ తీసుకుని భారీ ఓపెనింగ్స్ వైపు కన్ను వేసి విడుదల అవుతున్న ఈసినిమా విజయం హీరో నానితో పాటు ఈసినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకు కూడ చాల అవసరం..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: