రజినీకాంత్ కిడ్నాప్ కి ప్లాన్ చేసిన వీరప్పన్..!

Edari Rama Krishna
ఒకప్పుడు తమిళ,కర్ణాటక రాష్ట్రాలను గజ గజలాడించిన గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే తెలియని వారు ఉండరు. ఒక్క గందపు చెక్కలే కాదు..ఎనుగు దంతాలు కూడా స్మగ్లింగ్ చేస్తూ అడవిలోకి వచ్చిన ఏ పోలీస్ ని వదలకుండా చంపేశాడు. రెండు రాష్ట్రాలో అటవీ ప్రాంతం మొత్తం తన హస్తగతం చేసుకున్న వీరప్పన్ పోలీసులకు సవాల్ విసిరేవాడు. ఎన్ని శవాలు తిన్న రాబందైనా ఒక్క గాలివాటుకు ఎగిరిపోతుందని ఎన్నో దారుణాలు చేసిన వీరప్పన్ చివరికి ఓ పోలీస్ అధికారి పన్నిన వ్యూహంలో చిక్కుకొని ప్రాణాలు వదిలారు. ఇక తెలుగు,హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఆ మద్య ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేసి మంచి విజయం సాధించారు.

తాజాగా వీరప్పన్ బయోగ్రఫీ పై బాలీవుడ్ లో ‘వీరప్పన్ ’ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రం ప్రధాన పాత్రలో సచినో జోషి నటిస్తున్నారు. వీరప్పన్ ముఠా సభ్యులు, అనుచరులు, మద్దతుదారులు, సానుభూతిపరులు, అతడిని పట్టుకోవడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్ టీమ్ మెంబర్స్.. ఇలా ఎంతోమంది నుంచి ఎన్నో వివరాలని సేకరించి మరీ ఈ సినిమాని తెరకెక్కించాడట వర్మ.  ఈ సందర్భంలో వర్మ కు ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందట.

వీరప్పన్ పోస్టర్


గతంలో  కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్‌ని కిడ్నాప్ చేసినట్టుగానే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ని సైతం కిడ్నాప్ చేసేందుకు అప్పట్లో వీరప్పన్ యత్నించాడట. అయితే తన చిత్రానికి ఇది మంచి హైలెట్ గా ఉంటుందని ఓ సన్నివేశంలో భాగంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వీరప్పన్ గురించి ప్రస్తవిస్తూ..వీరప్పన్ స్టోరీ వింటే నమ్మశక్యంగా అనిపించదు. అతడిని పట్టుకునేందుకు జరిగిన ప్రయత్నాలు అంతకన్నా నమ్మశక్యం అంటున్నాడు వర్మ.

వర్మ ట్విట్ :

Veerappan used to think he is more famous than Rajnikanth and at one point he demanded a film to be made on him as a part of his Ransom

— Ram Gopal Varma (@RGVzoomin) May 17, 2016

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: