సారొచ్చారు : రివ్యూ

Prasad

Sarocharu:  Tweet Review  || తెలుగు ట్వీట్ రివ్యూ  ||  English Full Review

 

 రవితేజ నటించిన కొత్త సినిమా సారొచ్చారు. ఈ సినిమాలో రవితేజకు జంటగా కాజల్, రిచా గంగోపాధ్యాయ నటించారు. పరుశరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ నిర్మించారు. చిత్రకథ :   పారిస్ లో సంధ్య (కాజల్) కార్తీక్ (రవితేజ)ను తొలి చూపు లోనే ప్రేమిస్తుంది. అతన్ని కూడా ప్రేమలోకి దింపటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు తనకు గతంలోనే పెళ్లి అయిందని, అయితే తన భార్యతో విడాకులకు సిద్ధపడుతున్నానని కార్తీక్ చెపుతాడు. సంధ్య బావ గౌతమ్ (నారా రోహిత్)తో సంధ్య వివాహం చేయడానికి ఆమె తల్లితండ్రులు నిర్ణయిస్తారు. తనకు వివాహం అయ్యిందని సంధ్యతో కార్తీక్ ఎందుకు చెబుతాడు, సంధ్య ప్రేమ విషయాన్ని తెలుసుకున్న గౌతమ్ ఏం చేశాడు... అన్న విషయాలతో చిత్ర కథ సాగుతుంది. నటీనటుల ప్రతిభ :   రవితేజ ఈ సినిమాలో కొంచెం కొత్తగా కనిపిస్తాడు. తన ‘ఎనర్జిటిక్ స్థాయి’ కొంచెం తగ్గించుకుని నటించాడు. రవితేజ మార్క్ ఓవర్ యాక్షన్ ఈ సినిమాలో కనిపించదు. రిచా గంగోపాధ్యయతో జరిగే ఎపిసోడ్ లోనూ, రాజమండ్రి దాబాలో జరిగే యాక్షన్ సన్నివేశంలోనూ రవితేజ నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ‘రవితేజ-రిచాగంగోపాధ్యయ ఎపిసోడ్’ మినహా మిగిలిన సినిమాలో ఎక్కువ శాతం కాజల్ చుట్టూ తిరుగుతుంది. అల్లరి పిల్లగాను, ప్రేమ కోసం తపన పడే అమ్మయిగాను కాజల్ బాగా నటించింది. ఎంఎస్ నారాయణను భయపెట్టే సన్నివేశంలో కాజల్ ఇలా కూడా నటిస్తుందా అని అనిపిస్తుంది. పాటల్లో అందంగా కనిపించింది. రిచా గంగోపాధ్యాయ రవితేజ వంటి హీరోల పక్కనే సూట్ అవుతుంది. చిన్న పాత్ర అయినా నారా రోహిత్ గుర్తుపెట్టుకునే పాత్రలో నటించాడు. ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ యువ హీరో ఇలా ఓ అతిధి పాత్రలో నటించడం విశేషం. కనిపించేది కొద్ది సేపే అయినా ఎంఎస్ నారాయణ నవ్విస్తాడు. మిలిగిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ బావుంది. తెర మీద ప్రతీ ప్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. సంగీతం అలరిస్తుంది. ‘జగజగదేక వీరా..’, ‘కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయే..’ వంటి పాటలు బావున్నాయి. మిగిలిన పాటల చిత్రీకరణ కూడా బావుంది. మాటలు సినిమాకు తగినట్లుగా ఉన్నాయి. ‘అమ్మాయిని ఆట పట్టిస్తే అందంగా ఉంటుంది. అల్లరి పాలు చేస్తే అసహ్యంగా ఉంటుంది’, ‘తల్లికి, స్నేహితులకు చెప్పుకోలేని విషయం మనకు మంచి చేయదు’, ‘నిజం పరువు పోయినా ఫర్వాలేదు, నిజాయితీ మాత్రం ఓడిపోకూడదు’ వంటి మాటలు అక్కడక్కడా ఆకట్టకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వం విషయానికి వస్తే స్కీన్ ప్లే ప్రధానంగా సాగే ప్రేమకథ ఇది. ‘ఓ అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించడం, అతనితో గొడవ పడి వేరే వివాహనికి అంగీకరించడం, చివరికి ప్రియుడి దగ్గరకి చేరడం’ అనే తెలిసిన కథను కొత్తగా చెప్పడానికి కృషి చేశారు. అయితే ‘రవితేజ-రిచా గంగోపాధ్యాయ’ ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉన్నా, సినిమాలో మిగిలిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. పైగా సినిమాలో తరువాత ఏం జరుగుతుందో మనం ఉహించుకోవచ్చు. హైలెట్స్ :   కాజల్ నటన, పాటలు, ఫోటోగ్రఫీ డ్రాబ్యాక్స్ :    సాధారణమైన కథ, ఆకట్టుకోని స్క్రీన్ ప్లే చివరగా :   ‘సారొచ్చినా రవితేజకు హిట్ రాలేదు’    

Sarocharu : Cast & Crew

  • Director: Parasuram , Producer: Priyanka Dutt , Music: Devi Sri Prasad
  • Cinematography: Vijay K Chakravarthy, Editing : Kotagiri Venkateswara Rao, Writer: Parasuram
  • Star Cast: Ravi Teja, Kajal Agarwal, Richa Gangopadhyay, Nara Rohith, Jayasudha, Chandramohan, Raviprakash, M. S. Narayana and Srinivasa Reddy
  • Genre: Love Entertainer, Censor Rating: U, Duration: 02:30Hrs.
Sarocharu Movie Review, Rating | Sarocharu Review | Sarocharu Rating | Ravi Teja's Sarocharu Telugu Movie Cast & Crew, Music, Performances te Sarocharu Review;Sarocharu Rating;Sarocharu Movie Review;Sarocharu Movie Rating;Ravi Teja Sarocharu Movie Review, Rating;Telugu;Review;Rating;Ravi Teja;Kajal Agarwal;Richa Gangopadhyay;Telugu Latest Movies; true APHerald APHerald APHerald https://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Sarocharu-Movie-Review-300x300.jpg https://www.youtube.com/embed/S7p0UYSXrIY

Sarocharu Live Tweet Review Starts from 9:00 am [IST] ||  Sarocharu Full English Review

Sarocharu Live Tweet Review Starts from 9:00 am [IST] ||  Sarocharu Full English Review

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: