ఇప్పటి వరకు ప్రభాస్ ‘బాహుబలి’ తో సంపాదించుకున్న రికార్డును ప్రిన్స్ మహేష్ బ్రేక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ లో నటించినందుకు ప్రభాస్ కు 25 కోట్ల పారితోషికం ఇచ్చారు అన్న వార్తలు ఉన్నాయి. టాలీవుడ్ సినిమా రంగంలో ఇప్పటి వరకు ఏ హీరోకు ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వలేదు అని అంటారు. అయితే ‘బాహుబలి’ రికార్డును బ్రేక్ చేయలేకపోయినా ప్రభాస్ పారితోషిక స్థాయిని మహేష్ దాటిపోయినట్లుగా తెలుస్తోంది.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం మురగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించబోయే సినిమాకు 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెలుగు తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. ‘శ్రీమంతుడు’ ఘన విజయంతో మహేష్ కు ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈ భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
భారతీయ న్యాయ వ్యవస్థలో ఉండే లోపాలను ఎత్తి చూపే ఒక యువకుడి పాత్రను మహేష్ ఈ సినిమాలో పోషిస్తున్నాడు. సామాజిక కధాంశoతో ఉండే ఈ సినిమా స్క్రిప్ట్ ను మురగదాస్ చాలా పవర్ ఫుల్ గా రాసినట్లు టాక్. సామాన్యంగా మహేష్ ఇటువంటి సామాజిక కథాంశాలతో కూడిన సినిమాలలో నటించడం చాలా అరుదు అయిన నేపధ్యంలో ఈ సినిమా ప్రారంభం కాకుండానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్ వి ప్రసాద్ మురగదాస్ తో కలిపి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ నుండి సెట్స్ పైకి వెళుతుందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి శృతిహాసన్ ఇప్పటికే ఎంపిక అయిన నేపధ్యంలో మరో కీలక పాత్ర పోషించే హీరోయిన్ కోసం అన్వేషణ జరుతోoదని టాక్. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను వచ్చే సంవత్సరం చివరలో విడుదల చేయాలని మురగదాస్ ప్లాన్. ఏది ఎలా చూసుకున్నా 30 కోట్ల భారీ పారితోషికం తీసుకోవడంతో మహేష్ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి మరింత దగ్గర అయ్యాడు అనుకోవాలి..