మనీ: మూడు పువ్వులు..ఆరు కాయలు సాగే బిజినెస్ ఇదే..!!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అర్జించే బిజినెస్ లలో ఐస్ క్యూబ్ బిజినెస్ కూడా ఒకటి వాస్తవానికి సీజన్లో సంబంధం లేకుండా వీటి అమ్మకాలు ఉంటాయట. అయితే ఐస్ క్రీమ్స్ కి కూడా మంచి డిమాండ్ పెరిగిపోయింది. చిన్నచిన్న ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్స్, ఫుల్ల ఐస్క్రీ లతోపాటు ఐస్ క్యూబ్స్ కూడా మంచి డిమాండ్ ఉన్నది. జూసులలో ,బార్లలో వైన్ షాపులలో ఆసుపత్రులలో వీటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.
సాధారణంగా ఐస్ క్యూబ్ మిషన్ ధర లక్షలలో ఉంటుంది. లాభాల విషయానికి వస్తే.. చిన్న ఐస్ క్యూబ్ ప్యాకెట్ 15 రూపాయలు చొప్పున ఉంటాది. అయితే ఐస్ క్యూబ్ కి అయ్యే ఖర్చు కేవలం రూ .5 రూపాయలు. పెద్ద పెద్ద ఐసుగడ్డలను సైతం ఎంచుకున్నట్లు అయితే ఒక్కొక్కటి రూ.800 రూపాయల వరకు వెళుతుంది. ముఖ్యంగా ఏవైనా ఫంక్షన్స్ ఇతరత్రా వాటికోసం పెద్ద ఐసుగడ్డలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రతినెల సీజన్లో లక్ష రూపాయలకు పైగా సంపాదించుకోవచ్చు. అన్ సీజన్లో కూడా సుమారుగా 40 నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించుకొని అవకాశం ఉంటుంది. కేవలం సొంత బ్రాండింగ్ లతో పబ్లిసిటీ చేసుకుంటే మరింత లాభాలను కూడా పొందవచ్చు. అయితే ఈ ఐస్ క్యూబ్స్ కరిగిపోకుండా ఉండే వీలును చూసుకోవడం చాలా ముఖ్యము.