ఈ కార్‌ రేస్‌లో కేటీఆర్‌కు బ్యాడ్‌ న్యూస్.. అరెస్టు తప్పదా?

Chakravarthi Kalyan
ఫార్ములా ఈ కార్‌ రేసింగ్ కేసు కేటీఆర్‌ మెడకు గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. విచారణ ముమ్మరం చేస్తోంది. ఇవాళ ఫార్ములా ఈ కార్‌ రేసింగ్ కేసులో ఈడీ ముందుకు అప్పటి ఛీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్‌ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. ఆ తర్వాత  ఫార్ములా ఈ కార్‌ రేసింగ్ కేసులో రేపు ఐఏఎస్‌ ఆధికారి అర్వింద్ కుమార్‌ను ఈడీ విచారించనుంది.
ఫార్ములా ఈ కార్‌ రేసింగ్ కేసులో ఈనెల 7న విచారణకు హాజరవ్వాలని ఈడీ కేటిఆర్ కు కూడా నోటీసులు ఇచ్చింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారాంగా ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఏసీబీ నుంచి ఈడీ ఫార్ములా ఈ కార్‌ రేసింగ్ కేసుకు సంబంధించి పలు వివరాలు తీసుకుంది. ఈడీ జోరు చూస్తుంటే అరెస్టు తప్పేలా కనిపించట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: