మనీ: ఆధార్ ,పాన్ కార్డు ఉంటే చాలు.. రూ.5 లక్షలు వడ్డీ లేనీ లోన్..!!

Divya
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న లఖపతి దీదీ పథకాన్ని సైతం ప్రవేశపెట్టింది. కేవలం మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద మహిళలు కొత్త వ్యాపారాలను సైతం ప్రారంభించడానికి అలాగే వృత్తి శిక్షణ ఇంకా ఆర్థిక సహాయం కూడా అందించేలా చేస్తారు. లక్ష నుంచి 5 లక్షల వరకు ఎలాంటి వడ్డీ లేని రుణాన్ని కూడా పొందవచ్చు.. స్కిల్స్ ట్రైనింగ్ తో పాటు వ్యాపారాన్ని కూడా ప్రారంభించడానికి సలహాలను ఇవ్వడానికి కూడా సహాయపడతారు.
ఆర్థిక నిర్వహణ మార్కెటింగ్ ఆన్లైన్ వ్యాపారం ఇతరత్రా వాటిని కూడా మహిళలకు అందుబాటులో ఉంటే విధంగా చూస్తారట. ఈ పథకం ద్వారా ఇప్పటికే దాదాపుగా 10 కోట్ల మంది మహిళలు సైతం లబ్ధి పొందాలని ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మల సీతారాము వెల్లడించారు.. లఖపతి దిది పథకానికి చేరడానికి 18 నుంచి 50 ఏళ్లు లోపు మహిళలు అర్హులు.. స్వయం సహాయక సంఘాల మహిళలు మాత్రమే ఈ పథకంలో ఉండగలరు. జిల్లా మహిళా అలాగే శిశు అభివృద్ధి శాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడ లఖపతి దిది పథకానికి సంబంధించి ఫారంలో ఫిలప్ చేయాలి.

లఖపతి దిది నింపిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ తో పాటు దరఖాస్తు సమర్పించిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి.లఖపతి దిది పథకం అన్ని ప్రయోజనాలను కూడా ఆధార్ కార్డ్ ఆధారంగా పొందుతారు ముఖ్యంగా వయస్సు ప్రెసిడెంటు సర్టిఫికెట్ పాన్ కార్డు కూడా అవసరం పడుతుంది.. కరెంట్ బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి మొబైల్ నెంబర్ కూడా కచ్చితంగా ఉండాలట. అయితే ఈ పథకం వల్ల మహిళలకు మాత్రమే వర్తిస్తుంది.. ఈ పథకంతో ఎంతోమంది మహిళలు కూడా తమ సొంత కల్లా మీద నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: