Money: ఏపీ నేతన్నలకు జగన్ శుభవార్త.. వారి ఖాతాలో రూ.24 వేలు..!
ఈ నేపథ్యం లో తాజాగా ఏపీ నేతన్నలకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చేనేత కార్మికులకు అండగా నిలవడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నేతన్న నేస్తం అనే పథకం కింద లబ్ధిదారులకు రేపు వారి ఖాతాలో సీఎం జగన్ నిధులను జమ చేయనున్నారు ఒక్కొక్కరికి రూ .24 వేల చొప్పున 80,686 మంది ఖాతాలలో ఈ డబ్బు జమ కానుంది. ఇప్పటికే అర్హుల యొక్క జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు సేకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ పథకం ద్వారా గత నాలుగేళ్లలో నేతన్నలకు సుమారుగా రూ.766 కోట్ల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
ఇకపోతే అటు ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులలో ప్రవేశాలకు వైఎస్ఆర్ వర్సిటీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రాష్ట్ర కోటా కింద సీట్లను భర్తీ చేయడానికి నీట్ లో ర్యాంకులు సాధించిన వారు నేటి నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా పూర్తి వివరాల కోసం https://drysr.uhsap.in లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. 2014 జూన్ రెండవ తర్వాత ఏర్పాటు చేసిన ప్రైవేటు , వైద్య, మైనారిటీ, డెంటల్ కాలేజీలలో కాంపిటెంట్ కోటా కింద ఎంబిబిఎస్, బి డి ఎస్ సీట్లలో 100% రాష్ట్ర విద్యార్థులకే సీట్లు దక్కేలా ప్రభుత్వం ఇటీవల సవరణలు కూడా చేసింది.