Money: ఆదాయాన్ని రెట్టింపు చేసే పోస్ట్ ఆఫీస్ పథకం..!

Divya
ఎవరైనా సరే తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఒక చోట పెట్టుబడిగా పెట్టి మంచి రాబడి పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి అనేకమార్గాలు ఉన్నా సరే వాటిలో ఉత్తమమైన వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే సురక్షితమైన రాబడి కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకాలు ఎప్పుడూ మొదటి ఎంపికగా అవతరిస్తున్నాయి. ఇక పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన పథకం గురించి తెలుసుకోవాలి అంటే.. ఇది కస్టమర్ల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుందని చెప్పవచ్చు.
అదే కిసాన్ వికాస్ పత్రా పథకం ఇందులో పెట్టుబడి మొత్తం నిర్ణిత వ్యవధిలోనే రెట్టింపు అవుతుంది.. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని కింద కిసాన్ వికాస్ పాత్ర పై వడ్డీని ఈ సంవత్సరం 7.2% నుంచి 7.5% పెంచడం జరిగింది. అంటే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది రెట్టింపు రాబడులు లభిస్తున్నాయి. ఇక కిసాన్ వికాస్ పత్ర అనేది భారత ప్రభుత్వం చేత నిర్ణయించబడే ఒక పర్యాయ పెట్టుబడి పథకమని చెప్పవచ్చు. పెట్టుబడి కోసం పోస్ట్ ఆఫీస్ లో పెద్ద బ్యాంకులలో ఈ పథకం అందుబాటులోకి వచ్చింది.
ఈ పథకంలో రూ .5లక్షలు ఇన్వెస్ట్ చేయడం వల్ల వడ్డీ 7.5% లభిస్తుంది. ఇక 115 నెలల నిర్ణీత కాలానికి మెచ్యూరిటీ సమయంలో రూ.10 లక్షల సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ పథకం ద్వారా మంచి ఆదాయమే కాదు సురక్షితమైన రాబడి కూడా లభిస్తుంది.  ఇంకా ఈ పథకంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇక వెయ్యి రూపాయల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: