Money: రైతులకు సీఎం శుభవార్త.. రైతుబంధు నిధులు..!
పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ రైతుబంధు సహాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం అందించనుంది. ఇకపోతే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు లను సీఎం కేసీఆర్ ఆదేశిస్తూ త్వరలోనే నిధులు విడుదల చేసి ఈనెల 26వ తేదీ నుంచి రైతుల ఖాతాలో డబ్బు జమ కావాలి అని ఆదేశించారు. ఏదేమైనా ఈ విషయం తెలిసి తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు రైతులకు తెలంగాణ ప్రభుత్వమే కాదు ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రైతు భరోసా పేరిట డబ్బులు జమ చేయనున్న విషయం తెలిసిందే.
ఇకపోతే సీఎం జగన్ కూడా ఈనెల 26వ తేదీ తర్వాత ఇన్పుట్ సబ్సిడీని కూడా రైతుల ఖాతాలో అందించనున్నాడు ఇప్పటికే చాలామంది రైతులు ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్నారు. పంటల కోసం పెట్టుబడి పెట్టడానికి రైతులకు డబ్బులు అవసరం చాలా ఉంది ఇలాంటి నేపథ్యంలోనే సీఎం జగన్ ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తాను అని ప్రకటించారు ఏది ఏమైనా అటు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఒకే సమయంలో నిధులను విడుదల చేస్తూ వారికి వచ్చే పంట కోసం ఆసరాగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.