దివ్వెల మాదిరి ప్రతినెల ఎంత బంగారు కొంటుందో తెలుసా..?
ఆ స్నేహం వల్లే ఇటీవలే తనూజ బర్తడేను కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసింది. తన పుట్టినరోజుకి ఒక నెక్లెస్ కూడా గిఫ్ట్ గా ఇచ్చింది. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న దివ్వెల మాదిరి తన లైఫ్ లో జరిగిన కొన్ని అనుభవాలు, కష్టాలను అభిమానులతో పంచుకుంది. అలాగే తమ ఆస్తులు వివరాలను కూడా చెబుతూ ప్రతినెల మేము వర్కర్స్ కు రూ .25 లక్షల రూపాయలు శాలరీ కింద ఇస్తామని, అయితే ఆస్తి ఎంత అనే విషయం మాత్రం చెప్పలేను దేవుడు ఇచ్చినంత మాత్రమే ఉందని చెప్పగలనని తెలిపింది..
బంగారం అంటే తనకు చాలా ఇష్టం మా ఆయన (దువ్వాడ శ్రీనివాస్) నాకు బంగారం కొనుక్కోమని రోజుకో లక్ష రూపాయలు ఇస్తారు. నేను దాచిపెట్టి ప్రతి నెల రూ. 50 లక్షల రూపాయల బంగారం కొంటానని నేను మొదటి నుంచే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్గా ఉండేదాన్ని.. పెట్రోల్ బంకులు రన్ చేశాను, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తనకి బాగా అనుభవం ఉంది ఆ తర్వాతే పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యాయి. రాజకీయాల వల్లే మైనింగ్ పోర్టు బిల్లులు రూపంలో రూ .50 కోట్ల వరకు నష్టం వచ్చిందంటూ తెలియజేసింది. అయితే ఈ విషయం విన్న పలువురు నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.