HBD: పెద్ది నుంచి బర్తడే రోజు అదిరిపోయే అప్డేట్.. చరణ్ ఇరగదీశాడు..!
ఈ రోజున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. పెద్ది సినిమా నుంచి టీజర్ ని విడుదల చేయగా ఈ వీడియోలో రామ్ చరణ్ తన యాక్టింగ్ తో అదరకొట్టేశారు. గ్లింప్స్ మొదలులో కుస్తీ అంటే బంతితో బ్యాట్ కిఎదురెళ్లే ఆట కాదు.. ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట అనే డైలాగుతో మొదలవుతుంది. ముఖ్యంగా రామ్ చరణ్ తన బాడీ లుక్స్ తో అందరిని ఆశ్చర్యపరచినట్టుగా కనిపిస్తోంది. తన నటనతో కూడా విశ్వరూపం చూపించేశారు రామ్ చరణ్. ముఖ్యంగా గధ పట్టుకొని ఉన్న రామ్ చరణ్ లుక్స్ మాత్రం అభిమానులను తెగ ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వీడియోలో కుస్తీ గురించి చూపించినట్లు తెలుస్తోంది.
చివరిలో రామ్ చరణ్ "ఆటే నా పొగరు " అంటూ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంది. గత కొద్దిరోజులుగా పెద్ది సినిమా పోస్ట్ పోన్ అంటూ వినిపిస్తున్న వార్తలకు తాజాగా ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోందని టీజర్ లోనే చూపించారు. గేమ్ ఛేంజర్ సినిమాతో అభిమానులను నిరాశపరిచిన రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో కూడా మాస్ లుక్ లో అందరిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరొకసారి పెద్ది సినిమాలో కూడా మాస్ లుక్కులోనే కనిపించబోతున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి రికార్డులను తిరగా రాస్తుందో చూడాలి మరి.