వాహనదారులకు గుడ్ న్యూస్..పెట్రోల్,డీజిల్ ధరలు ఎంత తగ్గుతాయంటే..?
దీని ప్రకారం పెట్రోల్ లీటర్ కు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. గతంలో ఉన్న రూ .13 రూపాయల సుంకం ఇప్పుడు రూ .3 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ పైన గతంలో ఉన్న రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీని ద్వారా పెట్రోల్, డీజిల్ తగ్గించేలా తక్షణమే అమలులోకి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్ల చాలా ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ముఖ్యంగా ప్రపంచ ముడి చమురు సరఫరాలలో ఐదో వంతు వాటా కలిగినటువంటి ఇరాన్ ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యుద్ధం కంటే ముందు భారత్ చమురు అవసరాలలో 12 నుంచి 15% వరకు మాత్రమే ఈ మార్గం ద్వారా దిగుమతి చేసుకునేవారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా సామాన్యుల పైన ఈ భారం పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల నిత్యవసర వస్తువులు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని దీనివల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు పెట్రోల్ డీజిల్ పైన ఎంత తగ్గుతుందినే విషయం చూడాలి మరి.