పుట్టిన రోజు చరణ్ ది..కానీ ట్రెండింగ్ లో సందీప్ రెడ్డి వంగా..ఎందుకంటే..?

Thota Jaya Madhuri
మనందరికీ తెలిసిందే..సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు తమ పుట్టినరోజులను అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకునే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా, ఆ రోజు వారికి సంబంధించిన కొత్త సినిమాల అప్డేట్స్, ఫస్ట్ లుక్స్, టీజర్లు లేదా అనౌన్స్‌మెంట్లు విడుదల చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. అభిమానులు కూడా ఈ రోజును ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు, ఎందుకంటే తమ అభిమాన నటుడి నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ తప్పకుండా వస్తుందనే నమ్మకం ఉంటుంది. ఇది మరింతగా పాన్ ఇండియా స్టార్‌ల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. వారు తమ ప్రస్తుత ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాకుండా, భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి కూడా క్లూస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. దీంతో సోషల్ మీడియాలో ఆ రోజు మొత్తం ఆ స్టార్‌కు సంబంధించిన హడావిడి కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న రామ్ చరణ్ విషయంలో కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆయన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వస్తాయని, అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌ల గురించి కూడా క్లారిటీ వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫ్యాన్స్ అయితే ఉదయం నుంచే అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ టీజర్ విడుదలైంది. ఆ టీజర్‌లో రామ్ చరణ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఆయన స్టైల్, అట్టిట్యూడ్, మాస్ ఎలిమెంట్స్ అన్ని  కలిపి టీజర్‌ను మరింత హైలెట్ చేశాయి. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆ టీజర్‌ను వైరల్ చేస్తున్నారు.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సందర్భంలో రామ్ చరణ్ పేరు కంటే కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. కారణం ఏమిటంటే, రామ్ చరణ్ మరియు సందీప్ రెడ్డి వంగ కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఆయన పుట్టినరోజు రోజే వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సందీప్ రెడ్డి వంగ స్టైల్‌ను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఇద్దరి పేర్లే హైలైట్ అవుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజమైతే, అది ఇండియన్ సినిమా లెవెల్‌లో ఒక భారీ సంచలనంగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: