మనీ: ఆదాయాన్ని పెంపొందించే అద్భుతమైన మార్గాలు ఇవే..!

Divya
చాలామంది ఇప్పటి నుంచి డబ్బు పొదుపు చేస్తూ వృద్ధాప్యంలో జీవితాన్ని సుఖంగా కొనసాగించాలని ఆలోచిస్తున్నారు.. ఈ క్రమంలోనే మీరు కూడా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ వృద్ధాప్యాన్ని సంతోషంగా కొనసాగించాలని అనుకుంటున్నట్లు అయితే మీకోసం ఆర్థిక భద్రత ఇవ్వడానికి కొన్ని ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీ ఆదాయం రెట్టింపు అవ్వడమే కాకుండా ఎటువంటి రిస్కు లేకుండా వృద్ధాప్యంలో సంతోషంగా జీవితాన్ని కొనసాగించవచ్చు. మరి ఆ పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్:
దీనిలో పెట్టే పెట్టుబడికి బీమాతో పాటు మంచి రాబడి కూడా లభిస్తుంది. ముఖ్యంగా చాలామందికి పదవీ విరమణ తర్వాత అద్భుతమైన, ఆదర్శవంతమైన పథకం అని చెప్పాలి. ఇందులో పాలసీదారు జీవిత బీమా కవరేజ్ కోసం కొంత మొత్తాన్ని ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది.  మిగిలిన మొత్తం డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్  లేదా  బ్యాలెన్స్డ్ ఫండ్ లలో పెట్టుబడి పెడితే మంచి ఆదాయం పొందవచ్చు.
పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పథకం:
ఇందులో కనిష్టంగా 1000 రూపాయలు , గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయలను మీరు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలకు గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.  ఇకపోతే ఖాతా తెరిచిన రోజు నుంచి ఐదు సంవత్సరాలు ఈ పథకం మెచ్యూరిటీ కాలం వర్తిస్తుంది. ఇక వడ్డీ సంవత్సరానికి 7.4% చొప్పున నెలవారీగా పొందవచ్చు.
వీటితోపాటు జాతీయ పెన్షన్ పథకం కూడా ఒకటి.  ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.  అంతేకాదు సెక్షన్ 80 C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక వీటితోపాటు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం, అలాగే అటల్ పెన్షన్ యోజన పథకాల ద్వారా కూడా వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిస్క్ లేని జీవితాన్ని పొందడానికి అద్భుతమైన రాబడి పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: