మనీ: బిజినెస్ చేయాలనుకునే వారికి చక్కటి శుభవార్త..!
ఇందులో పెద్దగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు నెలకు కూడా మంచి లాభం వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కోరుకునే వారికోసం ఈ అద్భుతమైన బిజినెస్ ఐడియా తీసుకురావడం జరిగింది . దీని ద్వారా చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇవ్వవచ్చు. అలాగే మీరు కూడా మంచి ఆదాయాన్ని పెంచుకొని.. మీ బిజినెస్ ను మరింత విస్తృతం చేసుకోవచ్చు. అదే పాపడ్ తయారీ వ్యాపారం.. మీ ఇంటి నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఇందుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ప్రభుత్వం నుంచి కూడా మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఒకవేళ మీరు గ్రామంలో లేదా పట్టణంలో నివసించిన సరే దీనికోసం తక్కువ స్థలం కేటాయించి ఎక్కువ లాభాలు పొందవచ్చు.
మార్కెట్లో బంగాళదుంపలు , పప్పులు, బియ్యంతో చేసిన అప్పడాలకు భారీ డిమాండ్ ఉంది.ఈ వ్యాపారంలో మీరు 30000 కిలోల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న యూనిట్ ను సిద్ధం చేయడానికి ఆరు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి. ఇందులో నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం లోన్ ఇవ్వగా.. కేవలం రెండు లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెడితే సరిపోతుంది. మూడు నెలల్లో మీకు ఖర్చు బాగా వచ్చిన ఆ తర్వాత ఆదాయం రావడం మొదలవుతుంది. కాబట్టి వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది చక్కటి వ్యాపారం అని చెప్పవచ్చు.