మనీ: కేవలం రూ. 5000 ఉంటే చాలు.. ప్రతినెల రూ.50 వేలకు పైగా ఆదాయం..!!

Divya
బిజినెస్ చేయాలని ఆలోచించేవారికి పెట్టుబడి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం మీ దగ్గర 5000 రూపాయలు ఉంటే చాలు మీరు ప్రతి నెల రూ.50 వేలకు పైగా ఆదాయం పొందవచ్చు. ఇక అదేమిటంటే బ్రేక్ ఫాస్ట్ తయారీ.. నిజానికి జొమాటో, స్విగ్గి లాంటి సంస్థలు ఆన్లైన్ ఫుడ్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. ఆన్లైన్లో టిఫిన్ కి మాత్రం ఆశించినంతగా ఆర్డర్ లు ఉండడం లేదు.. ఇందుకు కారణం వాస్తవానికి టిఫిన్ ధర తక్కువగా ఉన్నా.. డెలివరీ చార్జెస్ ఎక్కువగా వేస్తూ ఉండడం వల్ల ఎవరు కూడా బ్రేక్ ఫాస్ట్ ను ఆర్డర్ చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే సామాన్యులు టిఫిన్ ను ఆన్లైన్లో ఆర్డర్ చేసే పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు దీనిని ఉపయోగించుకుని కొత్త బిజినెస్ ప్రారంభించి మంచి లాభాన్ని పొందవచ్చు

ఈ బిజినెస్ పెట్టడానికి మీ దగ్గర కేవలం రూ.5000 ఉంటే సరిపోతుంది.  ఇక బిజినెస్ కు మీ స్థానికంగా పబ్లిసిటీ చేయడం అత్యవసరం. ఇక మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు,  యూపీఐ ద్వారా బిల్ పేమెంట్ ను తీసుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి మీ దగ్గర ఒక వంట మాస్టర్ అలాగే ఒక డెలివరీ బాయ్ ను నియమించుకోవాలి.. లేదంటే మీ ఇంట్లో ఎవరైనా వంట బాగా చేస్తే వారు అలాగే మీరే డెలివరీ బాయ్ గా మారి మరింత ఆదాయాన్ని పొందవచ్చు.ముఖ్యంగా కరోనా కారణంగా ఇప్పటికీ కూడా చాలామంది బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. అలాంటి వారికి ఈ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది.

మీరు మంచి రుచి , క్వాలిటీతో కలిగిన సేవలు అందిస్తే వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుంది. మూడు పువ్వులు ..  ఆరు కాయలుగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు . అంతే కాదు సాయంత్రం స్నాక్స్ రూపంలో కూడా డోర్ డెలివరీ చేయవచ్చు ఖర్చులకు పోను రోజుకురూ. 2000 మిగిలినా కచ్చితంగా నెలకు రూ.50 వేలకు పైగా లాభం అయితే వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: