మనీ: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. రూ. కోటికి పైగా లాభం..!
ఇకపోతే ఒక ఉద్యోగికి 30 సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటే అతడి నెలవారీ జీతం రూ.50,000.. అందులో బేసిక్ రూ.15 వేలు ఉంటుంది అని అనుకుంటే ప్రతి సంవత్సరం ఐదు శాతం పెరుగుదలను పరిగణలోకి తీసుకున్న రిటైర్మెంట్ కల్లా పిఎఫ్ అకౌంట్ లో రూ.65,36,758 ఉంటాయి . ఇక్కడ 8.1% వడ్డీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది.. ఒకవేళ ఉద్యోగి బేసిక్ శాలరీ రూ. 25, 000 అనుకుంటే పిఎఫ్ అమౌంట్ కూడా బేసిక్ శాలరీ ప్రాతిపదిక పైన ఆధారపడి ఉంటుంది . ఇక్కడ కూడా ఐదు శాతం వార్షిక పెరుగుదలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక బేసిక్ శాలరీ పెరిగితే పీఎఫ్ అమౌంట్ కూడా భారీ పెరుగుతుందని మనం గమనించాలి.
టేక్ హోమ్ శాలరీ తక్కువగా అయినప్పటికీ భవిష్యత్తులో రిటైర్మెంట్ అయిన తర్వాత భారీ రిటర్న్స్ వస్తాయి. ఇకపోతే ఉద్యోగులు రిటైర్మెంట్ ఫండ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగి మీద కంపెనీ చేసే ఖర్చును సిటిసీ ( కాస్ట్ టు కంపెనీ) సింపుల్ గా చెప్పుకోవచ్చు. సిటిసి లో నెలవారి బేసిక్ పే అలవెన్సులు, రీయంబర్స్మెంట్ వంటివన్నీ కూడా కలిసి ఉంటాయి. కాబట్టి కచ్చితంగా రిటైర్మెంట్ తర్వాత మీకు మంచి ఆదాయం లభిస్తుంది.