మనీ: మహిళలకు శుభవార్త.. రూ.25 లక్షలు ఉచితం.. క్లారిటీ ఇచ్చిన పిఐబి..!
ఎవరి సృష్టించిన ఈ ఫేక్ న్యూస్ ను పలువురు యూట్యూబ్ ఛానల్స్ వారు అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇది పూర్తిగా ఫేక్ పథకమని అటువంటి ప్రకటన ఏది కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేయలేదు అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇకపోతే సామాజిక మాధ్యమాలలో వచ్చే ఇటువంటి నకిలీ లింకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకూడదు అని కూడా పిఐబి స్పష్టం చేసింది. ముఖ్యంగా మీ మొబైల్ ఫోన్ లకు ఎవరైనా ఇలాంటి అనుమానాధాస్పద మెసేజ్లు ఏవైనా వస్తే అవి నిజమో కాదు ఇలా చెక్ చేసుకోండి అంటూ అందుకు సంబంధించిన పిఐబి అధికారిక వెబ్సైట్ ను కూడా పంపించింది.
మీకు ఎవరైనా ఫ్రాడ్ కాల్స్ లేదా మెసేజ్ లు చేస్తే వాటిని https://factcheck.pib.gov.in అని ఈ లింకుకు మెసేజ్ పంపించాలి అని కూడా వివరణ ఇచ్చింది. ఒకవేళ లేదంటే..+91 8799711259 అనే నెంబర్ కి వాట్సప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు. ఇకపై వచ్చే ఫ్రాడ్ కాల్స్ మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు.