మనీ: ఆ పని చేసి.. నెలకు ఏకంగా రూ.6 లక్షలకి పైగా సంపాదిస్తున్న డాక్టర్ రైతు..!!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది రైతులు ఆందోళన చెందకుండా వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తే.. లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఒక రైతు తన ప్రతిభను ఉపయోగించి నెలకు సుమారు ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇక అది రాజస్థాన్.. అసలే ఏడారి ప్రాంతంలో నీటి కొరత కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడి పరిసర ప్రాంతాలలో తాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో చాలా మంది వ్యవసాయం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక అలాంటి చోట ఒక డాక్టర్ అద్భుతాలు సృష్టించి సిరుల పంట పండిస్తున్నాడు. నిరుపయోగంగా పడి ఉన్న తన సొంత భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రతి నెల లక్షల సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ రైతు.
ఇకపోతే ఎంత భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు..  ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతోంది..? ఎవరికి విక్రయిస్తున్నారు..?  నెలకు ఎంత సంపాదిస్తున్నారు..? అని పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. రాజస్థాన్లోని కోట్ పుత్లి పట్టణానికి చెందిన అమిత్ సింగ్ యాదవ్ వృత్తిరీత్యా డాక్టర్. వీరికి వున్న  వ్యవసాయ భూమి నిరుపయోగంగా మారుతున్న కారణంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. కానీ నీరు లేని కారణంగా ఏ పంటలు పండటం లేదు. ఇకపోతే తాను డాక్టర్ గా పనిచేస్తున్న ఆస్పత్రిలో కరెంట్ ఖర్చులను తగ్గించడానికి కొన్ని సంవత్సరాల క్రితం సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వారికి నెలకు 15 వేల రూపాయలు ఆదా అయ్యేవి.
ఇక సోలార్ ప్లాంట్ పై అవగాహన పెంచుకున్న ఇతడు తన రెండు ఎకరాల భూమి లో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశాడు. 1.1 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి 330 W  కెపాసిటీ ఉన్న 3400 సోలార్ ప్యానల్స్ ను అమర్చారు. ఇక  ఎండాకాలంలో ప్రతి రోజు సగటున 5 వేల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎండాకాలంలో రోజుకు 5,500 యూనిట్లు,  శీతాకాలంలో 3,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందట. ఇక సోలార్ ప్లాంట్ లో డీసీ కరెంటు ఉత్పత్తి అవుతుంది కాబట్టి దానిని ఏసీ కరెక్ట్ గా మార్చి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్ స్టేషన్ కు సరఫరా చేస్తున్నారు. మీకు దీనిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. కాబట్టి 25 సంవత్సరాల పాటు ఖచ్చితమైన ధరకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. యూనిట్ కి  నాలుగు రూపాయల చొప్పున రోజుకి రూ.20,000 చొప్పున నెలకు రూ.6 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు ఈ రైతు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: