మనీ: లోన్ కావాలంటే ఎంత సిబిల్ స్కోర్ ఉండాలో తెలుసా..?

Divya
ప్రతి వ్యక్తికి ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు అనేవి చాలా ముఖ్యంగా మారిపోయాయి. ఇక ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు లోన్ అనేది తీసుకుని ఉంటూ ఉంటారు. ఈ తరుణంలో అసలు క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యంగా అవసరం. అందువల్ల అందరూ సివిల్ స్కోర్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు ఒక వ్యక్తికి ఎంత క్రెడిట్ స్కోర్ అవసరం.. ఎంత ఉంటే బ్యాంకు నుండి సులువుగా లోన్ పొందవచ్చు.. తక్కువ వడ్డీ కి లోన్ కావాలి అంటే క్రెడిట్ హిస్టరీ స్కోర్ ఎంత ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ క్రెడిట్ స్కోర్ ను ఇన్సూరెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అందిస్తుంది. దీనిని సిబిల్ స్కోర్ అని అంటారు. ఈ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది.. అయితే కనీసం మనకు 750 స్కోరు ఉంటే చాలా మంచిది. ఇంత స్కోరు ఉంటే సమయానికి వారు చెల్లించాల్సిన పేమెంట్స్, లోన్స్, సరైన సమయానికి  చెల్లిస్తున్నారని అర్థము. ఇలా సమయానికి చెల్లించడం వల్ల బ్యాంకుల నుండి కూడా మనకి రిస్కు చాలా తక్కువగా ఉంటుంది.
750 కంటే ఎక్కువ క్రెడిట్స్ కనుక ఉంటే ఆ వ్యక్తులు బ్యాంకులో సులువుగా లోన్ పొందవచ్చు. ఒక వేళ 700-749 వరకు క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే క్రెడిట్ హిస్టరీ పర్వాలేదు అని అర్థమట. ఒకవేళ వీరికి లోన్ మంజూరు అయినా కూడా తక్కువ వడ్డీ రేటు వారికి పొంద లేరు. ఒకవేళ 600 నుంచి 699 మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్నట్లు అయితే వీరు సకాలంలో లోన్లు చెల్లించలేదని అర్థమట. ఇలాంటి వారితో రిస్కు ఎక్కువ అని బ్యాంకులు ఫైనాన్సియల్ కంపెనీ వాళ్ళు భావిస్తారు. 350 నుంచి 599 మధ్య క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే వీరు లోన్లు చెల్లింపు చేయడం లేదని అర్థమట. ఈ కేటగిరీ వినియోగదారులతో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి వారికి లోన్లు మంజూరు చేయరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: