మనీ: ప్రతి నెల రూ. 50 వేల పెన్షన్ పొందాలి అంటే ఇలా చేయండి..!!

Divya
ప్రతి ఒక్కరు కూడా పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడతారు అన్న విషయం అందరికి తెలిసిందే అయితే అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీరు ముందుగానే ప్రణాళిక చేసుకొని డబ్బులు పొదుపు చేయడం వల్ల రిటైర్మెంట్ తర్వాత మెరుగైన లాభాలను కూడా పొందవచ్చు. అంతే కాదు ప్రతి నెల పెన్షన్ రూపంలో మీరు డబ్బులను పొందడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు. ప్రతి నెల పెన్షన్ రూపంలో డబ్బు పొందినప్పుడు ఆర్థికంగా నష్టం రాదు. పైగా ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. అయితే ప్రతినెల 50 వేల రూపాయలు పెన్షన్ మీరు పొందాలి అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అనతికాలంలోనే మంచి రిటర్న్స్ కూడా లభిస్తాయి. అంతేకాదు నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలకు 50 వేలకు పైగా పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే.. ఒకవేళ మీ వయసు 30 సంవత్సరాలు అనుకుంటే మీకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతినెల ఎన్ పి ఎస్ లో రూ.10 వేల చొప్పున నెలకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది.
ఇక దీనిపై 10% రిటర్న్ కూడా లెక్కలోకి వస్తుంది. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత మొత్తం 2.53 కోట్ల రూపాయలు అవుతుంది. 40 శాతం యాన్యుటీ లో పెట్టుబడిగా పెడితే ఇక దానిని తీసివేసిన తర్వాత మీకు మొత్తం కోటిన్నర రూపాయలు చేతికి వస్తాయి . ఇక మిగతా డబ్బు ప్రతినెల 50 వేల రూపాయలు పెన్షన్ కింద  పొందవచ్చు. దీంతో మీ వృద్ధాప్యంలో ఎలాంటి టెన్షన్ లేకుండా జీవితాన్ని గడపచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: