మనీ: ఈ పథకంతో నెలకు రూ.5వేల పెన్షన్ సులభంగా..!!

Divya
అట్టడుగు వర్గాల ప్రజల కోసం అలాగే సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పథకాల ద్వారా ఎన్నో రకాల బెనిఫిట్స్ కూడా మీరు పొందవచ్చు. కొన్ని లక్షల మంది ఈ పథకాలలో చేరి మంచి రాబడిని సొంతం చేసుకుంటున్నారు. ఇక కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకం కూడా ఒకటే అన్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా ఇప్పటికే ఎంతోమంది ప్రయోజనాలను పొందుతున్నారు. చాలామంది ఈ పథకంలో చేరి ఇప్పటికి కొన్ని లక్షల రూపాయలను రాబడి గా పొందుతున్నారు. ఇకపోతే ఈ పథకం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా నాలుగు కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు చేరినట్లు సమాచారం.
అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా మీరు ప్రతి నెల 1000 రూపాయల నుంచి రూ. 5 వేల మధ్య పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇలా ఉండగా అటల్ పెన్షన్ యోజన పథకంలో ఎన్రోల్మెంట్ లో  సుమారుగా 80 శాతం మంది సబ్ స్కైబర్లు సుమారుగా రూ. 1000 పైగా పెన్షన్ పథకాలను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇదిలా వుండగా 13 శాతం మంది రూ.5000 పెన్షన్ ముందే ప్లాన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పథకం లో చేరడం వల్ల ప్రతి నెల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్ కూడా మీరు ఎంచుకుని ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. ఎంచుకునేటప్పుడు  జాగ్రత్తగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్లాన్ తీసుకుంటే సరిపోతుంది.
ప్రస్తుతం 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వారే ఈ పథకంలో ఎక్కువగా చేరారు. ఇక మీరు కూడా ఈ పథకాల ద్వారా ప్రతినెలా ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ కలిగే అవకాశం ఉంటుంది.  ప్రస్తుతం బ్యాంకులు మాత్రమే కాకుండా బీహార్ , జార్ఖండ్,  ఉత్తర ప్రదేశ్, ఒడిశా, అస్సాం , మధ్యప్రదేశ్ , త్రిపుర వంటి రాష్ట్రాలలో బ్యాంకర్ల కమిటీ లు కూడా ఈ స్కీం యొక్క లక్ష్యాలను ఇప్పటికే చేరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: