మనీ: రూ.4,500 పెట్టుబడితో కళ్లుచెదిరే పెన్షన్..!!

Divya
ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగులు చేస్తున్న మిస్టేక్ ఏమిటంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకపోవడమే.. ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు అయితే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా వచ్చే తరాలు కూడా సుఖంగా ఆర్థికంగా జీవించగలుగుతారు. రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి ఆలోచించకుండా ప్రస్తుతం జీవితాన్ని అనుభవించే వారు చివరి దశలో ఆర్థిక సమస్యలను తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సంపాదిస్తున్న అప్పుడే కొంత డబ్బులు దాచి పెట్టుకోవడం అలవాటుగా చేసుకోవాలి. ఇక ప్రస్తుతం జాతీయ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్ స్కీమ్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్ స్కీమ్ లో మీరు ప్రతి నెల కేవలం 4,500 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఇక మీరు ప్రతి నెల రూ.51, 848 రూపాయలను పెన్షన్ మీరు పొందవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ప్రభుత్వ పథకం కాబట్టి రిస్క్ ఉండదు పైగా పన్ను మినహాయింపు కూడా మనకు బాగా లభిస్తుంది. కాకపోతే దీని కింద పెట్టుబడిదారుడు సగటు వయస్సు 21 సంవత్సరాలు కచ్చితంగా ఉండాలి. పెట్టుబడి పెట్టడం వల్ల మీరు మంచి రాబడిని పొందవచ్చు.
ఈ పథకం 39 సంవత్సరాలు కొనసాగుతుంది కాబట్టి ఏడాదికి 54 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి. ఇక 39 సంవత్సరాలకు గాను పూర్తిగా రూ.21.06 లక్షల రూపాయలు అవుతుంది. అంతే కాదు దీనిపై మీరు 10 శాతం వడ్డీని కూడా పొందవచ్చు కాబట్టి మొత్తం కలుపుకొని రూ.2.59 కోట్లు అవుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రతి నెల సుమారుగా రూ.51,848 గా పెన్షన్ పొందవచ్చు. ఇక మీరు నేషనల్ పెన్షన్ సిస్టం పై ఆదాయపు పన్ను సెక్షన్ 80ccd 1, సెక్షన్ 80ccd 1b, సెక్షన్ 80ccd 2 కింద పన్ను మినహాయింపులు పొందుతారు. మీరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటే  నష్టం రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: