మనీ: రూ.10 ఆదాతో రూ.10 లక్షలు సొంతం.. ఎలాగంటే..?

Divya
ప్రతిరోజు 10రూపాయల చొప్పున ఆదా చేస్తూ వెళితే ఏకంగా రూ.10లక్షలు పొందవచ్చు. అయితే ఎలా అని ఆలోచిస్తున్నారా..? అది ఎలాగంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. అయితే రిస్క్ ఉంటుంది అని మాత్రం గమనించాలి.. నిజానికి మనం ప్రతి నెలా సంపాదించే డబ్బులు ప్రతి రోజు ఇంటి అవసరాలకు కర్చు అయిపోతూ ఉంటాయి. డబ్బులు మిగల్చడం అనేది అసంభవం అని చెప్పవచ్చు. కానీ ప్రతినెల కొంత మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి ఎంత కష్టం అయినా సరే ప్రతిరోజూ చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి మీరు సొంతం చేసుకోవచ్చు.
డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నా.. అందులో మీరు ఎక్కువ రాబడి వచ్చే మార్గాలను ఎంచుకోవడం మంచిది. మ్యుచూవల్ ఫండ్స్ లో డబ్బు లు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొన్ని దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను ఎంచుకోవాలి. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారు స్టాక్ మార్కెట్లో నేరుగా డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు లేదనేవారు మ్యూచువల్ ఫండ్స్ లో  పెట్టుబడి పెడుతూ దీర్ఘకాలంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి.
కొంత మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభార్జన కూడా ఉంటుంది.. ఇక మీరు దీర్ఘకాలంగా రోజుకు పది రూపాయల చొప్పున ఆదా చేస్తూ నెలకు 300 రూపాయలు ప్రతి నెల ఫండ్స్ లో  ఇన్వెస్ట్ చేయాలి. 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలి. ఇలా చేయడం వల్ల మెచ్యూరిటీ సమయంలో ఏకంగా పది లక్షల రూపాయలను పొందవచ్చు . అంతే కాదు 12 శాతం వార్షిక రాబడి కూడా ఉంటుంది. ఇక ఇందులో మీరు డైలీ, వీక్లీ ,మంత్లీ ఆప్షన్లను కూడా ఎంచుకునే అవకాశం కల్పించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: