మద్యం ప్రియులకు శుభవార్త..ఇప్పుడు రూ.10 వేలు కాదు రూ.2 వేలు మాత్రమే..!!

Divya

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్న వారికి ఒక చక్కటి శుభవార్త తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే సాధారణంగా రాత్రి సమయంలో లేదా డే సమయంలో ఎవరైనా సరే మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వ్యక్తులు పోలీసులకు 10 వేల రూపాయలను జరిమానా కింద చెల్లించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు దానిని కేవలం 2 వేల రూపాయలు గా మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.


ఇప్పటికే హైదరాబాద్ , సైబరాబాద్ వంటి మహానగరాల్లో  సుమారుగా 70 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు కావడంతో వీటన్నింటిని తగ్గించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఏరియాలలో కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి..ఈ తరుణంలో పెండింగ్లో ఉన్న కేసులను తగ్గించడానికి పదివేల రూపాయలను కాస్తా రూ.2000కు తగ్గించడం జరిగేది. అయితే ఈ గడువు కేవలం మార్చి 11 వరకు మాత్రమే అని తుది గడువును నిర్ణయించడం జరిగింది. ఇక ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నారో వారందరూ ప్రస్తుతం రెండు వేల రూపాయలను చెల్లించి కేసు కొట్టి వేయించుకోవడం జరుగుతోంది.


ఇక సమాచారం తెలియని వారు ఎవరైనా ఉంటే వెంటనే తెలుసుకొని డబ్బులు చెల్లించాల్సి ఉంది గా పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.. మద్యం సేవించి వాహనాలను నడపకూడదు అని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పోలీసులు హెచ్చరించినా.. ప్రజలు మాత్రం వినడం లేదని చెప్పవచ్చు. ఇలా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఒక్కోసారి ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది.. ఇప్పటికే చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ కింద మరణించిన వారు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తమై మద్యం సేవించి వాహనాలు నడక పోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: