మనీ: డబ్బు సంపాదించాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి..!!

Divya
మనం అనుకున్న కోరిక సిద్ధించాలంటే కేవలం పట్టుదల , కోరిక ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు అలవాట్లు కూడా ఉండాలి.. ముఖ్యంగా మనం పెంపొందించుకునే కొన్ని అలవాట్ల కారణంగా మన ఆదాయం కూడా పెరుగుతుంది అని అంటున్నారు మరికొంతమంది నిపుణులు. సాధారణంగా కొంతమంది తక్కువ జీతాల తోనే ఎక్కువ మొత్తంలో సేవింగ్స్ చేస్తూ ఉంటారు కానీ అది వాళ్లకు ఎలా సాధ్యమో తెలియక మరికొంతమంది సతమతమవుతూ ఉంటారు.. మీరు కూడా తక్కువ మొత్తంలో ఎక్కువ ఆదాయాన్ని పొందాలి అనుకుంటే ఈ అలవాటు తప్పనిసరిగా చేసుకోండి..

బడ్జెట్ అలవాటు చేసుకోవడం:
సాధారణంగా సంపాదించే ఏ ఒక్కరైనా సరే ముందుగా నేర్చుకోవాల్సిన విషయం బడ్జెట్.. మన ఇంటి అవసరాల ఏంటి..? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?అని విషయం మనకు తప్పకుండా తెలియాలి.. చేతికందిన జీతం మొత్తం ఖర్చు అవుతుంటే మాత్రం దాయడానికి ఏమీ మిగలదు. అందుకే పెట్టుబడులు , ఇంటి ఖర్చులు, సేవింగ్ సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవాలి.
అప్పులకు చాలా దూరంగా ఉండాలి:
వీలైనంత వరకు మనము ఇతరుల దగ్గర అప్పు తీసుకోకపోవడమే ఉత్తమమైన అలవాటు.. కానీ ఒక్కోసారి అప్పు చేయక..తప్పని పరిస్థితి కూడా రావచ్చు.. అలాంటప్పుడు మీరు బ్యాంకు లలో రుణాలు మాత్రమే తీసుకోండి..బయట ఎవరి దగ్గర వడ్డీకి అప్పు తీసుకోకండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న బిజినెస్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్ వంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు.
నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేయండి:
ముఖ్యంగా మనం కొనుగోలు చేసే ఏ వస్తువైనా సరే మొదట నాణ్యతను చూడాలి.. కొద్దిగ డబ్బులు ఎక్కువ అయినా సరే నాణ్యత కలిగిన వస్తువులను తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం మన్నిక వస్తాయి.

ఇక ఈ కొన్ని అలవాట్లు కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే డబ్బు వృధా చేసుకోకుండా కచ్చితంగా ఆదా చేసుకోగలుగుతారు. ఇక కేవలం ఈ అలవాట్లు ఆచరణలో పెట్టి ,అతి తక్కువ సమయంలోనే లక్షాధికారి అవ్వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: