మనీ: రూ.150 ఆదాతో రూ.24 లక్షలు ఆదాయం..!

Divya
సామాన్యులు సైతం ఎటువంటి సందేహం లేకుండా నిరభ్యంతరంగా పొదుపు చేసుకునే అవకాశాన్ని పోస్టాఫీసులు అందిస్తున్నాయి.. పోస్ట్ ఆఫీసులు ప్రవేశపెడుతున్న ఎన్నోరకాల స్కీములు.. వినియోగదారులకు బాగా ఉపయోగపడుతున్నాయి అనే చెప్పాలి. స్మాల్ సేవింగ్స్ పథకంలో డబ్బులు పెట్టుబడి గా పెట్టడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండకపోగా ఆకర్షణీయమైన రాబడి కూడా లభిస్తుంది.. రాబడి కూడా మీరు ఎంచుకునే స్కీమును బట్టి ప్రయోజనం చేకూరుతుంది..

ఇక అలాంటి వాటిలోని ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ అందించే ఎన్నో పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి.. ఈ స్కీమ్ లో ఫుల్ సెక్యూర్ గా ఉండడంతో పాటు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.. అందుకే ఈ పథకంలో చేరడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. పోస్ట్ ఆఫీసులు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా ఖాతాదారుడికి 7.1 శాతం వడ్డీ కూడా అందేలా చూస్తోంది.. ఇకపోతే ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఒకవేళ పెంచుకోవాలి అనుకుంటే, మరో ఐదు సంవత్సరాల పాటు గడువును పొడిగించుకోవచ్చు.
అంటే మీరు రోజుకు 150 రూపాయల చొప్పున పొదుపు చేస్తూ ,నెలకు 4,500 రూపాయలను ఈ పథకంలో పెట్టుబడిగా పెట్టడం వల్ల మంచి ఆదాయం ఉంటుంది. ఉదాహరణకు మీరు 15 సంవత్సరాల తర్వాత నిర్ణీత గడువు మరో ఐదు సంవత్సరాలు అని అనుకుంటే 20 సంవత్సరాల వరకు  నెలకు 4,500 రూపాయలను చెల్లించడం వల్ల 20 సంవత్సరాల తర్వాత మీ చేతికి 24 లక్షల రూపాయలు అందుతాయి.

మీరు కనిష్టంగా 1.5 లక్షల రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. మొత్తంగా వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటారు కాబట్టి అధిక మొత్తంలో మీకు వడ్డీ కూడా లభించే అవకాశాలు ఉంటాయి..మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం పైన కానీ లేదా నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత మొత్తం డబ్బు తీసుకునేటప్పుడు కానీ మీ డబ్బులు పై ఎటువంటి పన్ను విధించరు .. పన్ను మినహాయింపు కాబట్టి చేతికి 24 లక్షల రూపాయలను పోస్ట్ ఆఫీస్ వారు పీపీఎఫ్ స్కీమ్ కింద అందివ్వడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: