మనీ : సీనియర్ సిటిజన్స్ కు శుభవార్త తెలిపిన బ్యాంకులు..!
కేవలం సీనియర్ సిటిజన్ లకు మాత్రమే ఈ ప్రత్యేక అవకాశాన్ని ఒక నిర్ణీత సమయం వరకు పొందడానికి గడువును ఈ బ్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. అదికూడా ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 2021 వ సంవత్సరం వరకు మాత్రమే ఉంటుంది.. 2020 వ సంవత్సరం మే నెలలో కేవలం సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక సీనియర్ సిటిజన్స్ కనుక ఈ బ్యాంకులు ప్రవేశపెట్టిన స్కీం లో జాయిన్ అవడానికి మొదట 2020 సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించారు. ఆ తరువాత డిసెంబర్ 31 2020 వరకు గడువు పొడిగించారు. ఆ తర్వాత మార్చి 31 2021 వరకు, ఆ తర్వాత జూన్ 30వ తేదీ 2021 వరకు పొడిగించడం జరిగింది. అయితే ఇప్పుడు చివరిసారిగా 2021 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ పథకంలో చేరడానికి సీనియర్ సిటిజన్స్ కు అవకాశం కల్పించబడింది.
అంతే కాదు ఎస్బిఐ పథకంలో అయితే సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేకంగా 8.20 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. ఇక హెచ్డీ ఎఫ్ సి బ్యాంక్ అయితే 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే 6.25 శాతం వడ్డీని అందించగా, ఐ సి ఐ సి ఐ ఈ పథకంలో చేరిన సీనియర్ సిటిజన్ల కోసం 6.30 శాతం వడ్డీని అందిస్తోంది. FD తీసుకుంటే ఎస్బిఐ బ్యాంకు లో అత్యధికంగా వడ్డీ లభిస్తోంది.. కాబట్టి మీరు ఏ బ్యాంకులో చేరితే బాగుంటుందో నిర్ణయించుకోవచ్చు.