మనీ : వెహికల్ ఇన్సూరెన్స్ ల పై సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు.. !

Divya
ఎవరైనా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకుంటే, తప్పకుండా ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉండి తీరాల్సిందే. అయితే ఇప్పుడు వచ్చే నెల అనగా సెప్టెంబర్ నుంచి, మోటార్ సైకిళ్ళు నుంచి కార్లు అలాగే ట్రక్కుల తో పాటు ఇతర వాహనాలపై కూడా ధరలను పెంచేందుకు ఈ వాహన సంస్థలు అన్ని విధాల సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పుడు సరికొత్తగా ఈ వాహన బీమా పై చెన్నై హైకోర్టు సంచలన తీర్పు నివ్వడం జరిగింది. అదేమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రతి ఒక్క వాహనంపై ఐదు సంవత్సరాల పాటు బంపర్ టు బంపర్ బీమా అనేది తప్పకుండా ఉండాలి అని,  ఇది ప్రతి ఒక్కరూ అమలు చేసుకోవాలని వాహన కొనుగోలుదారులకు హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు కారుకు సంబంధించిన డ్రైవర్ తో పాటు యజమాని అలాగే ఇతర ప్రయాణికులకు కూడా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ తప్పకుండా ఇవ్వాలి, అని అది కూడా ఐదేళ్లపాటు ఉండాలని జస్టిస్ ఎస్ విశ్వనాథన్ గురువారం తీర్పు చెప్పారు.
వాహన కొనుగోలు చేసిన యజమానులు కూడా అప్రమత్తంగా ఉండాలి అని హైకోర్టు తీర్పునిచ్చింది. ముఖ్యంగా వాహన యజమాని... తనతో పాటు ఉండే డ్రైవర్ అలాగే ప్యాసింజర్ లతోపాటు థర్డ్ పార్టీ ప్రయోజనాల పరిరక్షణకు కూడా, తప్పనిసరిగా ఆచితూచి అడుగు వేయాలి అని పేర్కొంది. వాహన యజమాని పై ఇలాంటి భారాన్ని తగ్గించడానికి హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇకపోతే థర్డ్  పార్టీ భీమా సంస్థలను కూడా మద్రాస్ హైకోర్టు మందలించడం జరిగింది.. ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అని అడగ్గా , ఇటీవల రోడ్డు ప్రమాదంలో  బాధితులుగా మిగిలిన ఒక కుటుంబానికి 14 లక్షల రూపాయలు ఇవ్వాలని  ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పక్కకుపెట్టి  14.65 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని , న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ ఆదేశించింది.  ఇక థర్డ్ పార్టీ బీమా కంపెనీలు కూడా కవరేజ్  కింద కేవలం వాహనం డామేజ్ అవడంతో పాటు యజమానికి గాయాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: