మనీ : మరో సరికొత్త ప్రైజ్ మనీ తో ముందుకు వచ్చిన కేంద్రం ..!

Divya
మోడీ ప్రభుత్వం.. యువతలో ఆలోచించే విధానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించాలి అనే నేపథ్యంతో.. సరికొత్త కాంటెస్ట్ లను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఛాలెంజ్ లో నెగ్గిన వారికి కొన్ని లక్షల రూపాయలను బహుమతిగా ప్రకటించడం గమనార్హం. భారతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు సంస్థలకు కావలసిన లోగోలను, సింబల్స్ ను ఎవరైతే ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారో వారికి ఐదు లక్షల రూపాయల నజరానా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మరో సరికొత్త చాలెంజ్ తో ప్రజల ముందుకు వచ్చింది మోడీ ప్రభుత్వం.అయితే ఛాలెంజ్ ఏమిటి ..? ఆ చాలెంజ్ లో నెగ్గిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం అమృతో మహోత్సవం అనే పేరుతో ఒక యాప్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. యాప్ ఇన్నోవేషన్ లో భాగంగానే ఒక కాంటాక్ట్ ను మోడీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2021 వ సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా ఎదిగే సత్తా వున్న యాప్స్ ను ఎవరైతే గుర్తిస్తారో వారికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటి బహుమతి కింద 25 లక్షల రూపాయలు ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం  సిద్దమైంది.16 కేటగిరిలు అనగా ఎడ్యుకేషన్ , వినోదం, వ్యవసాయం, సోషల్ మీడియా,న్యూస్ ,గేమ్స్ వంటి కేటగిరీలో అత్యున్నత ప్రమాణాలతో వుంటూ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మీరు  యాప్స్‌ను రూపొందించవచ్చు.
ఇక దరఖాస్తు చివరి తేది సెప్టెంబర్ 30వ తేదీ. ఇక ఈ కాంటెస్ట్ లో నెగ్గిన వారికి రెండవ బహుమతి కింద 15 లక్షల రూపాయలు, మూడవ బహుమతి కింద 10 లక్షల రూపాయలను అందజేస్తామని ప్రకటించింది మోడీ ప్రభుత్వం. అయితే ఇందులో దరఖాస్తు చేసుకున్న వారికి రెండు టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మొదట మీరు రూపొందించిన యాప్ లకు స్క్రీనింగ్ ఉంటుంది. ఆ తర్వాత జ్యూరీ ఎంపిక చేసి డెమో ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం .. మీలో కూడా టాలెంట్ ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి అంటూ కేంద్రం యువతకు పిలుపునిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: