మనీ : ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త

Divya
ఈపీఎఫ్ - ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్.. ఇక ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక శుభవార్త. ఇక త్వరలోనే ఈపీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో ఈపీఎఫ్ వడ్డీ జమ కాబోతోంది. ఇటీవల ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ త్వరలోనే తమ ఖాతాల్లో డబ్బులు పెట్టిన చందాదారులకు, సుమారుగా ఆరు కోట్ల మంది చందాదారుల బ్యాంకు ఖాతాల్లో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కింద వడ్డీని జమ చేయడం జరుగుతుంది అని తెలిపింది. ఒక ఖాతాదారుడు ఈపీఎఫ్ఓ సంస్థకు ట్విట్టర్ లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది..
ఈపీఎఫ్ అధికారి  చందాదారుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.." ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది .అతి తక్కువ సమయంలోనే ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ అయినట్లు చూపించవచ్చు. ఇక అప్పటి వరకు మీరు చేసిన డబ్బుకు వడ్డీని పూర్తిగా ఇవ్వబోతున్నారు.. అంతేకాదు మీకు ఎలాంటి నష్టం కూడా ఉండదు. దయచేసి కొంత కాలం వేచి ఉండండి.." అని ట్వీట్ చేయడం జరిగింది.
ఇప్పటికే రిటైర్మెంట్ ఫండ్ రెగ్యులేటరీ కింద ఈ నెలాఖరుకి 8.5% ఈపీఎఫ్ వడ్డీ జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాసెస్ లో ఉంది కాబట్టి చందాదారులు కొంత సమయం వేచి ఉండాల్సిందే. తర్వాత మీ ఈపీఎఫ్ ఖాతాలో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నెలాఖరు లోపు డబ్బులు జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించింది ఈపీఎఫ్ఓ సంస్థ.

మీరు కూడా ఆన్లైన్లో మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలంటే..? ముందుగా యు ఏ ఎన్ నంబర్ అలాగే పాస్వర్డ్ ఉండితీరాలి.https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login ఐ డి ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఈ లింక్ పై క్లిక్ చేయగానే, ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీ పిఎఫ్ ఖాతా కు ఇచ్చిన యూ ఏ ఎన్ నెంబర్ అలాగే పాస్వర్డ్లను ఎంటర్ చేసి , మీ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో చెక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: