మనీ : ఇలా చేస్తే రూ. 2 లక్షలు ఫ్రీ !

Divya

కష్టపడితే తప్ప డొక్కాడని పరిస్థితులు ఏర్పడిన సమయంలో జోక్ గా ఉందా ? అని కోపం వస్తోంది కదూ ! నిజమే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే ఇది.. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పబోయేది అక్షరాలా సత్యం. ఏమిటంటే ఒక్క చిన్న పని చేస్తే చాలు..మీ అకౌంట్ లో రెండు లక్షలు ఉచితంగా వస్తాయి. పెట్రోల్, డీజిల్ వాడకం పెరగడంతో ఇంధన ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ రేట్ ఇప్పటికే సెంచరీ దాటేసింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇక్కడ వాహనదారులకు ఒక తీపి కబురు అందుబాటులో ఉంది. అది ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివితే తెలుస్తుంది.

పెట్రోల్ ధరలు అమాంతం పెరగడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఒక కంపెనీ అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ ఆయిల్ తమ కస్టమర్లకు రూ.2 లక్షలు గెలుచుకొనే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం ద్వారా 18 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా సరే రూ.2 లక్షలు గెలుచుకోవచ్చు.

ఆ రూ.2లక్షలు పొందడం కోసం ఏం చేయాలంటే,  మీ వెహికల్ కు డీజిల్ పట్టించేటప్పుడు బిల్లు తీసుకోవడం. మీరు కనీసం 25 లీటర్లు డీజిల్ పట్టించాల్సి ఉంటుంది. అంటే ఒకే లావాదేవీలపై 25 లీటర్లు ఫ్యూయల్ వేయించుకోవాలి. అలాగే బిల్లు కూడా తీసుకోవాలి. ఈ బిల్లులో డీలర్ కోడ్, బిల్లు నెంబర్ వంటివి ఉంటాయి. మీరు ఈ కోడ్ ను, బిల్లు నెంబర్ ను 7799033333 నెంబర్ కి ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి. డీలర్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత స్పేస్ ఇచ్చి బిల్లుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి, డీజిల్ ఎన్ని లీటర్లు కొట్టించారో ఎంటర్ చేయవలసి ఉంటుంది.
తరువాత ఈ నెంబర్ కు 7799033333 ఎస్ఎంఎస్ పంపించాలి. లక్కీ డ్రా ద్వారా విజేతలకు డబ్బులు అందిస్తారు. ఈ ఆఫర్ కేవలం జూలై 31 వరకు మాత్రమే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: