మనీ : మన భారతదేశంలోని ఆ క్రికెటర్ సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Divya

సాధారణంగా మిగతా దేశాల క్రికెటర్లతో పోలిస్తే,  మన భారతదేశపు క్రికెటర్ల సంపాదన ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అందులో మరీ ముఖ్యంగా మన భారతదేశంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్ లు ఎవరు అని అడిగితే, ఎప్పుడూ ముందుగా ఉండేది ధోనీ, సచిన్, విరాట్ కోహ్లీలు. ఎందుకంటే వీరు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెటర్లు గా రికార్డు సృష్టించారు.. కానీ వీళ్ళందరి కంటే కూడా అత్యంత సుసంపన్నమైన క్రికెటర్, మరొకరు ఉన్నారు అంటే ఎవరైనా నమ్మగలరా..? ఆ సంపన్న క్రికెటర్ కి కేవలం 23 సంవత్సరాలు అని,  ఇప్పటివరకు క్రీడారంగంలో ఎటువంటి పేరుప్రఖ్యాతులు కూడా సంపాదించలేదు అని చెబితే ఎవరూ నమ్మరు..

అయితే ఆ యువ క్రికెటర్ అత్యంత సంపన్నమైన క్రికెటర్ గా నిలుస్తూ, అన్ని రికార్డులను తిరగరాస్తూ ఉన్నాడు.. ఇంతకీ అతను ఎవరా అని ఆలోచిస్తున్నారా..? అతనెవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త అయినా కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా. ఇతనికి క్రికెట్ అంటే మహా ఇష్టం. ప్రస్తుతం ఇతడు మధ్యప్రదేశ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు.. ఇక ఇతని ఆస్తుల విలువ తెలుస్తే మాత్రం అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.. ఇతని ఆస్తి విలువ అక్షరాల 70 వేల కోట్ల రూపాయలు. ఇక ఇంత  ఆస్తి ఉంది కాబట్టే మన భారతదేశంలోని క్రికెటర్ల లో అందరిలోను అత్యంత సంపన్నుడిగా పేరుపొందాడు.

అయితే ఆర్యమన్ బిర్లా కు అంతర్జాతీయ క్రికెటర్ గా, ఎదగాలి అనే ఒక చిరకాల కోరిక ఉందని ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. అయితే ఇతని లో మరో ప్రత్యేకత  కూడా వుంది. అది ఏమిటంటే ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్. ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్ లో నెంబర్ వన్ స్టార్ క్రికెటర్ కావాలనే ఆశయంతోనే కఠినమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.. మరొక విశేషమేమంటే తన తండ్రి పేరు కానీ, ఇంటి పేరు కానీ ఎక్కడా వాడుకోకుండా తన సొంత శక్తితో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అనేది తన తపన అని బిర్లా చెబుతున్నాడు..

అంతేకాకుండా ఆర్యమన్ బిర్లా అతికష్టమైన " లెఫ్ట్ ఆర్మ్ ఆర్తో డాక్స్ బౌలింగ్"  ను కూడా ఆయన నేర్చుకున్నాడు. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో కూడా బాగా ట్రైనింగ్ పుచ్చుకొని ఆల్రౌండర్ క్రికెటర్ గా క్రీడా రంగంలోకి ప్రవేశించాడు. 2017 వ సంవత్సరం ఇండోర్ లో మధ్యప్రదేశ్ తరపున ఆడే ఒడిస్సా జట్టుకు 22 పరుగులు చేశాడు. ఇక సీకే నాయుడు ట్రోఫీలో 11 మ్యాచుల్లో 795 పరుగులు సాధించాడు. ఏదిఏమైనా అంత ఆస్తి ఉన్నప్పటికీ, అతి సామాన్యమైన క్రికెటర్ గా క్రీడారంగంలో రాణిస్తున్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఆర్యమన్ బిర్లా కూడా త్వరలోనే అంతర్జాతీయ క్రికెటర్ గా పేరుగాంచాలని  మనం కూడా ఆశిద్దాం.. సో ఆల్ ది బెస్ట్ టు ఆర్యమన్ బిర్లా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: