అఫీషియల్ : పుష్ప 2 రిలీజ్ డేట్ వచ్చేసింది..

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "పుష్ప 2 "..ఈ సినిమా ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.గతం లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ "పుష్ప"సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమా లో అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు సాంగ్స్ రిలీజ్ చేసారు.రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి.ఈ సినిమా ను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఈ సినిమా షూటింగ్ ఇంకా 50 రోజుల కు పై సమయం పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది.ఈ సినిమా లో ఓ స్పెషల్  కూడా వుంది.అయితే ఈ సాంగ్ కోసం ఇంకా హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేయలేదు.దీనితో ఈ సాంగ్ షూటింగ్ కూడా పెండింగ్ లో వుంది.అలాగే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వుండటం తో ఈ సినిమా ను ఆగస్టు 15 న రిలీజ్ చేయడం కష్టమని భావించిన చిత్ర యూనిట్ ఈ సినిమాను వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసారు.ఈ సినిమాను డిసెంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: