
డబ్బే డబ్బు : తెలుగు రాష్ట్రాలలో పెరిగిపోతున్న సొంతింటి పంటల సంస్కృతి !
కరోనా పరిస్థితుల ముందు చాలామంది పండ్లు కూరగాయలు ఆకు కూరలు కొనుక్కోవడానికి పెద్దపెద్ద మాల్స్ కు రైతుబజార్లకు వెళ్ళి వారికి ఇష్టమైన కూరలను పండ్లను కొనుక్కుని తెచ్చుకునే వారు. అయితే కరోనా వచ్చిన తరువాత జనంలో జాగ్రత్తలు పెరిగిపోవడంతో ఇప్పుడు చాల చోట్ల సొంతింటి పంటల సంస్కృతి పెరిగిపోయింది అన్నవార్తలు వస్తున్నాయి.
ఒక అంచనా ప్రకారం మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 2.5 లక్షల ఇళ్ళల్లో మిద్దె పంటల సంస్కృతి పెరిగిపోయిందని ఇల్లు డాబా బాల్కని ఇలా ఏకాస్త జాగా దొరికినా తమ ఇంటినే ఒక పోలంగా మార్చి కూరగాయలను పండ్లను కొనుక్కోవడం బదులు కోసుకుంటాం అనే స్థాయిలో ప్రజల అభిప్రాయాలు మారిపోయాయి అంటూ ఒక ప్రముఖ దినపత్రిక ఒక షాకింగ్ కథనాన్ని ప్రచురించింది.
ముఖ్యంగా భాగ్యనగరంలో చాలామంది ఇళ్ళల్లో తమ ఇంటి మేడ పై కూరలు పూల మొక్కలు పెంచుతూ పాత పడ్డ బక్కిట్లల్లో ఖాళీ డ్రమ్స్ లో ఆఖరికి చిన్నచిన్న ఖాళీ డబ్బాలలో కూడ ఎవరికీ కావలసిన కూరలు వాళ్ళు పండించుకుంటు పక్కింటి వారికి దానం కూడ చేస్తూ సిటీ కల్చర్ లో పల్లె వాతావరణాన్ని తీసుకు వస్తున్నారు. ఎవరికి వారు తమకు కావలసిన కూరలను ఇలా పండించుకోవడం వలన తమ కుటుంబం ప్రతి నెలా కూరలు పండ్ల పై పెడుతున్న సుమారు 3 వేల ఖర్చు ఆదా అవుతోంది అంటు చాలామంది ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఈ ఇంటి సాగు పై జనానికి ఉండే అనుమానాలను నివృత్తి చేసి వారిని ప్రోత్సహించడానికి పలువురు రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక కార్యకర్తలుగా మారి ఇంటి సాగుకు మాట సహాయం చేతల సహాయం చేస్తూ దీనికోసం ఫేస్ బుక్ వాట్సాప్ లలో గ్రూపులు ద్వారా ఒకరికొకరు సందేశాలు ఇచ్చుకుంటున్నారు అంటే సోషల్ మీడియా ద్వారా జనానికి చెడుతో పాటు మంచి కూడ ఎంత వేగంగా జరుగుతుందో అర్థం అవుతుంది..