డబ్బే డబ్బు : కరోనా టీకా తో ముడిపడిన బంగారం !
ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటలలో బంగారం విలువ అనూహ్యంగా పడిపోవడం వెనుక అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. కరోనా కు టీకాలు వస్తే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చితి తొలిగిపోతుందని బంగారం పై పెట్టుబడులు కన్నా స్టాక్ మార్కెట్ పై పెట్టుబడులు పెట్టడం చాలమంచిది అన్న భావన ఏర్పడటంతో బంగారం రేటు అనూహ్యంగా దిగి వచ్చింది.
దీనికితోడు అమెరికా అధ్యక్షుడుగా బైడెన్ ఎన్నిక కావడం స్టాక్ మార్కెట్ లో ఉత్సాహాన్ని పెంచింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ మరికొన్ని రోజులు కొనసాగితే బంగారం ధర మరింత తగ్గే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ఎంత తగ్గినప్పటికీ మేలిమి బంగారం ధర 45 వేలకు మించి తగ్గదని ఇంచుమించు అదే స్థాయిలో బంగారం ధర కొంతకాలం కొనసాగే ఆస్కారం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 పైసలు క్షీణించడంతో రానున్న రోజులలో డాలర్ మరింత బలపడే ఆస్కారం ఉంది అని అంటున్నారు. కేవలం ఒకే ఒక్క రోజులో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మదుపర్ల సంపద 2 లక్షల కోట్లు పెరగడంతో షేర్ మార్కెట్ లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి సమయంలో దూసుకు వెళ్ళినట్లుగా స్టాక్ మార్కెట్ దీపావళి సమయానికి నిలదొక్కుకుంటున్న పరిస్థితితులలో ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ సంవత్సరాంతానికి షేర్ మార్కెట్ మరింత జోష్ లోకి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి..