1000 కోట్ల బడ్జెట్ తో బాలయ్య నెక్స్ట్ సినిమా..!?

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణ ఎప్పుడు ఇలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అన్నది ఎవరికి తెలియని అంశం. దీంతో ఆయన సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు సినీ ఆడియన్స్. ఇకపోతే బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకున్న తర్వాత విరసింహారెడ్డి తో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మరొక సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ సినిమాని ఏ దర్శకుడు తో చేస్తాడు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. 

ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం వినబడుతుంది. అయితే బోయపాటి మరియు అనిల్ రావిపూడి సినిమాల తరువాత బాలకృష్ణ తన దృష్టి మొత్తాన్ని పాన్ వరల్డ్ సినిమాల పైన పెట్టాడన్న సమాచారం వినబడుతుంది. అయితే బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తనకి చంగిస్ ఖాన్ బయోపిక్ లో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికని బయట పెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పినప్పటికీ చంగిస్ ఖాన్ కి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలించి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట డైరెక్టర్ బి గోపాల్.

ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో రౌడీ ఇన్స్పెక్టర్ నరసింహనాయుడు సమరసింహారెడ్డి వంటి సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. తాజాగా ఇన్ని ఏళ్ల తరువాత మళ్లీ బాలకృష్ణతో ఈ క్రేజీ ప్రాజెక్టుని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడుట బి గోపాల్. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా కోసం నిర్మాత కోనేరు సత్యనారాయణ 1000 బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నట్లుగా సమాచారం వినబడుతుంది .దీంతో మొదటిసారి బాలయ్య 1000 కోట్ల బడ్జెట్ సినిమాలో నటిస్తున్నందుకు బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: