పవన్ 'తొలిప్రేమ' రీ రిలీజ్..ఎప్పుడంటే..!?

Anilkumar
స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను ఈమధ్య వరుస పెట్టి రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ రెబల్, పవన్ కళ్యాణ్ జల్సా ,మహేష్ బాబు పోకిరి ,చిరంజీవి గ్యాంగ్ లీడర్ ఇటీవల సింహాద్రి ఇలా ఒకదాని వెంట ఒకటిగా స్టార్ హీరోల పాత సినిమాలను వరుస పెట్టి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఫాన్స్ కూడా అదే తరహాలో ఆ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరొక సినిమా రిలీజ్ కు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా మరేదో కాదు తొలిప్రేమ. ఇక ఈ సినిమా అప్పట్లో యూత్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కి సైతం బాగా కనెక్ట్ అయింది. 

ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము లేపింది తెలుగులో వచ్చిన ఎఫెక్ట్స్ లవ్ స్టోరీ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాను 4కే రెజల్యూషన్ తో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారట. అయితే ఈ సినిమానో జూన్ 30 2023న చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ గోకులంలో సీత సుస్వాగతం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని స్టార్ హీరో చేశాయి. అదే సమయంలో కొత్త దర్శకుడు అయిన ఏ కరుణాకర్ చెప్పిన కథ నచ్చడంతో తొలిప్రేమ సినిమా

చేయడానికి ఒప్పుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది.ఎస్ ఎస్ వి ఆర్ట్స్ బ్యానర్ పై జి వి రాజు ఈ సినిమాని నిర్మించారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా జులై 24 1998లో రిలీజ్ అయింది. కరుణాకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. సత్యనారాయణ ముత్యాల సుబ్బయ్య భీమినేని లాంటి పేరున దర్శకులతో మొదట మూడు సినిమాలను చేశాడు పవన్ కళ్యాణ్ .దాని తర్వాత కొత్త దర్శకుడికి అవకాశం ఇయ్యాలి అన్న ఉద్దేశంతో తొలిప్రేమ సినిమాల నటించాడు పవన్ కళ్యాణ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: