బాలయ్య సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్..క్లారిటీ ఇచ్చిన మిల్కి బ్యూటీ..!?

Anilkumar
గత కొంతకాలంగా బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందని.. ఇక ఆ సినిమాలో నటించడానికి అనిల్ రావిపూడి తమన్నా ని అడుగుతే తమన్నా ఒప్పుకోలేదని.. దానికి కారణం అసి 3 సినిమా సమయంలో వారిద్దరి మధ్య జరిగిన గొడవలే కారణమని.. అదంతా మర్చిపోలేక తమన్నా ఆ పాటకి ఒప్పుకోలేదని.. రూమర్లు సోషల్ మీడియాలో ఎంతలా వినిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ రూమర్స్ ని ఖండిస్తూ తమన్న ఒక పోస్ట్ ను షేర్ చేసింది. దీంతో తమన్నా షేర్ చేసిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. అయితే ఎఫ్ త్రీ సినిమా సమయంలో అనిల్ రావిప్పుడికి తమన్నాకి మధ్య ఒక గొడవ జరిగింది. 

దాంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.ముందుగా అడిగిన డేట్ ఇచ్చిన తమన్నా ఆకలిలో అడ్జస్ట్ చేయలేక పోయిందట. ఒక స్పెషల్ పాట కోసం తమన్నా డేట్ లను కేటాయించలేకపోయిందట. దీంతో అనిల్ తమన్నా మధ్య ఒక చిన్న గొడవ జరిగిందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ఆ సమయంలో అనిల్ రావిపూడి స్పందిస్తూ అవేమి పెద్ద  గొడవలు కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అనంతరం ఎఫ్ త్రీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా కనిపించకపోవడంతో ఆ.వార్తలు మరింత బలపడ్డాయి. అయితే మళ్లీ ఇప్పుడు అదే తరహాలో అనిల్ రావిపూడి తమన్నాను అడిగాడు.. బాలయ్యతో చేస్తున్న ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందని..

ఆ సినిమాలో తమన్నాను తీసుకునేందుకు అడుగుతే తమన్నా అంగీకరించలేదన్న వార్తలు వినపడుతున్నాయి. తాజాగా వీటిపై స్పందించింది తమన్న. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. అనిల్ రావ్ ప్లీజ్ సార్ తో పని చేయడం ఎప్పుడూ నాకు సంతోషమే.. కచ్చితంగా  ఎంజాయ్ చేస్తూ పని చేస్తాను.. అలాగే నందమూరి బాలకృష్ణ సార్ అన్న నాకు ఎంతో గౌరవం.. వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా విషయంలో ఇలాంటి నిరాధారమైన వార్తలను చూసి నాకు చాలా బాధగా ఉంది.ఏదైనా రాసేటప్పుడు కాస్త రీసెర్చ్ చేసి రాయడం మంచిది. అంటూ చెప్పకు వచ్చింది తమన్నా. ఇక బాలయ్య సినిమాలోని ఆ స్పెషల్ పాట కోసం ఒక హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారట.త్వరలోనే ఆ పార్టీకి సంబంధించిన షూటింగ్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: