మహేష్ సినిమా తర్వాత బాలీవుడ్ హీరోలతో జక్కన భారీ ప్రాజెక్ట్..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న రాజమౌళి మళ్లీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ లతో బిజీగా మారాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు రాజమౌళి. వాటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సినిమాని అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో పెరకెక్కించబోతున్నారు.ఈ సినిమా వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాని వచ్చేయడాది స్టార్టింగ్ లో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు ఈ ఏడాది చివర్లో ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి కాస్టింగ్ సెలక్షన్ కూడా పూర్తి చేయరున్నారట. వాటితో పాటు వర్క్ షాప్ కూడా నిర్వహించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా పూర్తి చేసిన తర్వాత బాలీవుడ్ హీరోలతో  రాజమౌళి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్న వినపడుతోంది. కానీ ప్రస్తుతం రాజమౌళి దృష్టి అంతా కూడా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా పైనే ఉంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఇప్పటివరకు రాజమౌళి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
తన తదుపరి సినిమా మహాభారతం చేసే ఉద్దేశంలో ఉన్నా కూడా దాన్ని ఎప్పుడూ స్టార్ట్ చేస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో తో రాజమౌళి నెక్స్ట్ సినిమాను చేయబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ తో రాజమౌళి యొక్క సినిమా అయినా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. కానీ ఆయన ఆలోచనలు ఎప్పుడు టాలీవుడ్ హీరోలు మాత్రమే ఉంటారు. అయితే రాజమౌళి తన నెక్స్ట్ సినిమా కూడా బాలీవుడ్ స్టార్ హీరోలతో చేసే అవకాశాలు ఉన్నప్పటికీ రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ మాత్రం టాలీవుడ్ హీరోలకే ఉంటుంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒక వేళ బాలీవుడ్ స్టార్ హీరోలతో చేస్తే త్రిబుల్ ఆర్ సినిమాలో లాగా అజయ్ దేవగన్ తరహాలో కీలక పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఉండే రోల్స్ చేసే అవకాశాలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: